Kaizer News

Vikarabad: హైకోర్టు తీర్పు స్పీకర్‌కు చెంపపెట్టు:

Vikarabad: హైకోర్టు తీర్పు స్పీకర్‌కు చెంపపెట్టు: డాక్టర్ మెతుకు ఆనంద్

· City - Hyderabad · hmtvlive.com

Shorts Vikarabad: దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడే దిశగా కీలక పరిణామం. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్‌ను స్పీకర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టి దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించింది. హైకోర్టు తీర్పు స్పీకర్ నిర్ణయానికి చెంపపెట్టు లాంటిది. ప్రజలు ఏ పార్టీ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించారో, ఆ ప్రజా తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉంటుంది. పార్టీ మార్పుల విషయంలో రాజ్యాంగం, చట్టం నిర్దేశించిన నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉంది. ఈ తీర్పుతో “అధికారంలో ఉన్నాం కదా.. ఏం చేసినా చెల్లుతుంది” అనే ధోరణికి న్యాయస్థానం అడ్డుకట్ట వేసినట్లైంది. స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు తీసుకునే నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేలా ఉండాలి. కానీ దానం నాగేందర్ అనర్హత విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు.. స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది. పార్టీ ఫిరాయింపులకు ప్రజలే తగిన సమాధానం చెబుతారు. ఈ తీర్పు తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను

Original source: hmtvlive.com
Read more on Kaizer News