Kaizer News

Nepal Floods: టీషర్ట్ ఊపి.. హెలికాప్టర్‌లోకి ఎక్కి

Nepal Floods: టీషర్ట్ ఊపి.. హెలికాప్టర్‌లోకి ఎక్కి.. నేపాల్ వరదల్లో బాలుడి వీడియో వైరల్

· National - India · hmtvlive.com

Nepal Floods: నేపాల్‌లో వరదలు, ఆకస్మిక వరదల కారణంగా పలు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ బాలుడిని హెలికాప్టర్ సిబ్బంది సాహసోపేతంగా రక్షించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరదల కారణంగా ఓ ఇంట్లో చిక్కుకుపోయిన బాలుడు.. సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో హెలికాప్టర్ శబ్దం వినిపించడంతో వెంటనే భవనం పైకి చేరుకున్నాడు. తన ఒంటిపై ఉన్న టీషర్ట్‌ను విప్పి గాల్లో అటూఇటూ ఊపుతూ హెలికాప్టర్ సిబ్బంది దృష్టిని ఆకర్షించాడు. బాలుడి పరిస్థితిని గుర్తించిన సిబ్బంది వెంటనే హెలికాప్టర్‌ను అతడి వద్దకు తీసుకెళ్లారు. అయితే భవనం వద్ద హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయ్యేందుకు సరైన ప్రదేశం లేకపోవడంతో.. గాల్లోనే చక్కర్లు కొడుతూ బాలుడికి సమీపంగా వచ్చింది. సిబ్బంది సూచనల మేరకు బాలుడు హెలికాప్టర్ ల్యాండింగ్ స్కిడ్‌ను పట్టుకుని జాగ్రత్తగా అందులోకి ఎక్కాడు. దీంతో సిబ్బంది అతడిని సురక్షితంగా తరలించారు. ఈ ఘటనను సమీపంలో ఉన్న కొందరు వీడియో తీసినట్లు తెలుస్తోంది. బాలుడిని విజయవంతంగా రక్షించగానే అక్కడున్న వారు ఆనందంతో కేరింతలు కొట్టడం కూడా వీడియోలో వినిపిస్తోంది. తన సమయస్ఫూర్తితో బాలుడు సహాయం కోరిన తీరు, రెస్క్యూ సిబ్బంది చూపిన చాకచక్యం ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News