Kaizer News

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

· Business · sakshi.com

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. పెరుగుతున్న చమురు ధరలు, యూఎస్‌ వడ్డీ రేట్ల పెరుగుదల గురించి ఆందోళన కారణంగా నిఫ్టీ 50, సెన్సెక్స్ పడిపోయాయి. ఉదయం 9:50 గంటల సమయానికి సెన్సెక్స్ 367.60 పాయింట్లు లేదా 0.48 శాతం క్షీణించి 76,896.91 వద్ద, నిఫ్టీ 50 148.85 పాయింట్లు లేదా 0.62 శాతం క్షీణించి 24,026.80 వద్ద ట్రేడవుతున్నాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, అదానీ ఎంటర్ ప్రైజెస్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.53 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 73 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ సిమెంట్, నిఫ్టీ మీడియా తక్కువ పనితీరు కనబరిచాయి. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 89.31 డాలర్లు యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.73 శాతానికి చేరాయి. గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.25 శాతం నష్టపోయింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) ‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా విజయ్‌ దేవరకొండ (ఫొటోలు) నల్గొండ జిల్లాలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు (ఫొటోలు) టన్నెళ్లలో కుళ్లిన మృతదేహాలు.. నేపాల్ వరదల తర్వాత బయటపడ్డ షాకింగ్ నిజాలు.. డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్ శిలాఫలకం తప్ప... వెలిగొండకు నువ్వు చేసిందేమిటి? బాబు క్రెడిట్ చోరీపై జగన్ రియాక్షన్ ఆసియా కప్ లో భారత మహిళల సత్తా.. థాయ్ లాండ్ పై తిరుగులేని గెలుపు

Original source: sakshi.com
Read more on Kaizer News