Kaizer News

ఫెయిల్‌ కాదు.. నైపుణ్య శిక్షణకు అర్హులు

ఫెయిల్‌ కాదు.. నైపుణ్య శిక్షణకు అర్హులు

· National - India · sakshi.com

10, 12వ తరగతుల మార్కుషీట్లలో ఇక ‘ఫెయిల్‌’ఉండదు పట్నా: పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణులైతే ‘పాస్‌’, ఉత్తీర్ణులు ఆకకపోతే ‘ఫెయిల్‌’ అని మార్కుషీట్లలో ముద్రిస్తుంటారు. ఫెయిల్‌ అయిన విద్యార్థులు మళ్లీ హాజరవుతుంటారు. మార్కుషీట్ల విషయంలో బిహార్‌లో కీలక మార్పునకు నాంది పలికారు. 10, 12వ తరగతుల విద్యార్థుల మార్కుషీట్లలో ఇకపై ‘ఫెయిల్‌’అనేదే ఉండదు. ఉత్తీర్ణులు కాకపోతే.. ఫెయిల్‌ అని కాకుండా ‘నైపుణ్య శిక్షణకు అర్హులు’ అని ముద్రిస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు శనివారం ప్రకటించారు. ‘బిహార్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ అండ్‌ ఎగ్జామినేషన్‌’అందించే వృత్తివిద్యా శిక్షణా కార్యక్రమాలను విద్యార్థులు అభ్యసించేలా చేయడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశమని తెలిపారు. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం

Original source: sakshi.com
Read more on Kaizer News