Kaizer News

Banana: 5 రకాల అద్భుతమైన అరటి పండ్లు! తింటే ఇవి కద

Banana: 5 రకాల అద్భుతమైన అరటి పండ్లు! తింటే ఇవి కదా తినాల్సింది..

· National - India · tv9telugu.com

యెల్లకి అరటిపండు.. యెల్లకి లేదా నెయ్‌ పూవన్‌ అరటిపండు చిన్న పరిమాణంలో ఉండి మంచి సువాసన, తీపి రుచికి ప్రసిద్ధి. ఇందులో కార్బోహైడ్రేట్లు, పొటాషియం, ఫైబర్, విటమిన్‌ B6 వంటి పోషకాలు లభిస్తాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌ రిటైల్‌ మార్కెట్‌లో డజన్ ధర సుమారు రూ.136–196 వరకు ఉండొచ్చు. నెంద్రన్‌ అరటిపండు.. కేరళతో పాటు దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన నెంద్రన్‌ను పచ్చిగా వంటల్లో, పండుగా కూడా ఉపయోగిస్తారు. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, పొటాషియం, విటమిన్లు లభిస్తాయి. ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్‌లో డజన్ సుమారు రూ.131–174 ధర ఉండొచ్చు. పూవన్‌ అరటిపండు.. పూవన్‌ రకం తీపి రుచి, సువాసనకు ప్రసిద్ధి. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, పొటాషియం, విటమిన్‌ B6తో పాటు కొంత ప్రొటీన్‌ కూడా లభిస్తుంది. ఒక అధ్యయనంలో పూవన్‌ రకంలో 100 గ్రాములకు సుమారు 1.37 గ్రాముల ప్రొటీన్‌ ఉన్నట్లు నమోదైంది. ప్రస్తుతం డజన్ ధర సుమారు రూ.85–121గా ఉండొచ్చు. రోబస్టా అరటిపండు.. రోబస్టా సాధారణంగా తక్కువ ధరలో లభించే రకం. శరీరానికి తక్షణ శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు, పొటాషియం, ఫైబర్‌ ఇందులో ఉంటాయి. ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్‌లో డజన్ ధర సుమారు రూ.49–75 మధ్య ఉండొచ్చు. ఎర్ర అరటిపండు.. ఎర్ర అరటిపండు ఇతర రకాల కంటే ప్రత్యేకమైన రంగు, రుచితో ఉంటుంది. సాధారణ అరటిపండ్ల మాదిరిగానే పొటాషియం, ఫైబర్, విటమిన్‌ B6, విటమిన్‌ C వంటి పోషకాలు అందిస్తుంది. ప్రస్తుతం కొన్ని రిటైల్‌ మార్కెట్లలో డజన్ సుమారు రూ.83–170 వరకు ఉండొచ్చు

Original source: tv9telugu.com
Read more on Kaizer News