Kaizer News

ఇరాన్ బెదిరింపులు.. బయటకు వెళ్లలేక.. ట్రంప్ జూనియర

ఇరాన్ బెదిరింపులు.. బయటకు వెళ్లలేక.. ట్రంప్ జూనియర్ ఏకాంత జీవితం

· International · tv9telugu.com

అమెరికాతో తీవ్ర స్థాయిలో ఘర్షణ పడుతున్న ఇరాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చిన్న కుమారుడిపై బెదిరింపులకు దిగింది. బారెన్‌ ట్రంప్‌ ను హత్య చేస్తామని బెదిరిస్తూ.. ఇరాన్‌ ప్రభుత్వ అనుబంధ మీడియా ..ఛానల్‌ 3 ఓ సంచలాత్మక వీడియోను ప్రసారం చేసింది. అందులో 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది. బారెన్‌ ఏ సమయంలో ఎక్కడ ఉంటాడు? అతడిని టార్గెట్ చేయాలంటే సరైన చోటు ఏది? వంటి విషయాలను గ్రాఫిక్స్‌లో చూపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుడు బారన్‌ ట్రంప్‌కు హత్య భయం పట్టుకుంది. ఇరాన్ బెదిరింపులతో ఒంటరి జీవితం గడుపుతున్నట్లు, తాజాగా తన హత్యకు ఇరాన్‌ రివార్డు కూడా ప్రకటించడంతో బారన్ మరింత అలర్ట్ అయినట్లు న్యూయార్క్ పోస్ట్ దినపత్రిక రాసుకొచ్చింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కు అనుబంధంగా ఉన్న మీడియా సంస్థ ఛానెల్‌-3 ‘‘బ్యారన్‌ను ఎక్కడ చంపొచ్చు’’ అనే టైటిల్ తో ఇటీవల ఓ కార్యక్రమం ప్రసారం చేసింది. అందులో బారెన్ ఎక్కడెక్కడ తిరుగుతాడన్న వివరాలను బయటపెట్టింది. అతడిని హత్య చేసిన వారికి 10 మిలియన్‌ డాలర్లు అంటే రూ.95 కోట్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. వీడియోలో బారెన్‌తో ఉండే కుటుంబ సభ్యులు, స్నేహితుల దృశ్యాలు.. సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులను తప్పించుకొని అతడి నివాసంలోకి ప్రవేశించే మార్గాలను చూపించారు. అమెరికాలోని ఉన్నతాధికారులు, కీలక నేతలను హతమార్చడానికి ఇరాన్‌ కుట్ర పన్నుతోందని అమెరికా ప్రాసిక్యూటర్లు తాజాగా ఆరోపించారు. ఇరాన్‌ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల సమయంలో.. ట్రంప్‌ ను చంపుతామని ఆయన మద్దతుదారులు బెదిరించడాన్ని వారు గుర్తుచేసారు. అయితే జులైలో ‘ట్రంప్‌ సతీమణి మెలానియాను ఎలా హత్య చేయాలి?’ అనే వీడియోను ఇరాన్‌కు చెందిన ‘తస్నిమ్‌’ అనే మీడియా సంస్థ ప్రసారం చేయగా.. అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ విచారణ ప్రారంభించింది. భద్రతా ముప్పు దృష్ట్యా బ్యారన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను మీడియాలో ప్రచురించవద్దని మెలానియా ట్రంప్‌ కార్యాలయం పత్రికా రంగాన్ని అభ్యర్థించింది

Original source: tv9telugu.com
Read more on Kaizer News