2027 వన్డే ప్రపంచకప్‌నకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ.. టీమ్‌ఇండియా ఇప్పటి నుంచే ప్రణాళికలు మొదలుపెట్టింది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో ప్రత్యామ్నాయాలను సిద్ధం చేయడంపై సెలెక్టర్లు దృష్టి సారించారు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్‌కు బ్యాకప్‌గా తిలక్ వర్మను సిద్ధం చేసే ఆలోచన తెరపైకి వచ్చింది. దీంతో 2027 ప్రపంచకప్ జట్టులో అయ్యర్ స్థానంపై చర్చ మొదలైంది. అయితే ప్రస్తుతానికి అయ్యర్ స్థానానికి ముప్పు వచ్చిందని చెప్పడం కంటే.. అతడికి సరైన ప్రత్యామ్నాయం ఉండేలా టీమ్ మేనేజ్‌మెంట్ ముందస్తు ప్రణాళికలు రచిస్తోందని చెప్పొచ్చు. తిలక్ వర్మ ఎడమచేతి వాటం బ్యాటర్. ప్రస్తుత భారత వన్డే టాప్ ఆర్డర్‌లో ఎక్కువ మంది కుడిచేతి వాటం ఆటగాళ్లే ఉన్నారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వంటి కుడిచేతి వాటం బ్యాటర్ల మధ్య తిలక్ వర్మ ఉంటే బ్యాటింగ్ కూర్పులో వైవిధ్యం వస్తుందని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఎక్కువమంది చదివినది: IND vs SL: తప్పు చేశారు గంభీర్.. ఆ ఒక్కడికి చోటిచ్చి ఉంటే ఈజీగా గెలిచేవాళ్లు..! అంతేకాదు.. తిలక్ తన ఆఫ్‌స్పిన్‌ను కూడా మెరుగుపరుచుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ సూచించినట్లు తెలుస్తోంది. అతడు నాలుగు ఓవర్లు వేసే స్థాయికి ఎదిగితే జట్టులో అదనపు బౌలింగ్ ఆప్షన్ లభిస్తుంది. శ్రేయస్ అయ్యర్ భారత వన్డే జట్టులో కీలక మిడిలార్డర్ బ్యాటర్. అయితే ప్రపంచకప్ వంటి సుదీర్ఘ టోర్నీలో ఒక్క ఆటగాడిపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలను సిద్ధం చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి తరచూ గాయాలతో ఇబ్బంది పడుతుండటం కూడా ఈ ఆలోచనకు కారణంగా తెలుస్తోంది. టాప్ ఆర్డర్‌లోనే కొంత బౌలింగ్ చేయగల ఆటగాడు ఉంటే జట్టు సమతుల్యత మరింత మెరుగవుతుందని కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భావిస్తున్నట్లు సమాచారం. 2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనుంది. అక్కడి పిచ్‌లపై పేస్, బౌన్స్‌ను ఎదుర్కోవడం బ్యాటర్లకు పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. ఇటీవల గాయంతో శ్రేయస్ అయ్యర్ కొంతకాలం ఆటకు దూరమయ్యాడు. పేస్, బౌన్స్‌కు వ్యతిరేకంగా అతడి తాజా ఫామ్‌ను కూడా టీమ్ మేనేజ్‌మెంట్ పరిశీలించాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2027 ప్రపంచకప్ సమయానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ కెరీర్‌లో మరింత ముందుకు వెళ్లి ఉంటారు. వారి ఫిట్‌నెస్, పనిభారం కూడా అప్పటికి కీలక అంశాలుగా మారొచ్చు. అదే సమయంలో కేఎల్ రాహుల్ కూడా 2027 ప్రపంచకప్ నాటికి 35 ఏళ్లు దాటుతాడు. రవీంద్ర జడేజా కూడా అప్పటికి జట్టులో ఉంటాడా? అన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అందుకే యువ ఆటగాళ్లను సిద్ధంగా ఉంచాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఇటీవల శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా పరిగణించారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తిలక్ వర్మను కూడా ఆప్షన్‌గా పరిశీలించి ఉండాల్సిందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఎక్కువమంది చదివినది: Team India: జట్టు నుంచే కాదు, కెప్టెన్సీ పోస్ట్ కూడా పీకేస్తారనుకోలే.