కేసులు.. అరెస్టులు.. అన్నీ ఆదేశాల మేరకే! జూబ్లీహిల్స్ కేసుపై సిట్ వేయాలి! పోలీస్ పోస్టింగులపై విచారణ జరగాలి! పెద్దలకు ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయమా? సుమంత్ ఎక్కడున్నాడు? ఎఫ్‌ఐఆర్‌ల వెనుక ఎవరి ఆదేశాలు? చిన్న పోలీసులే ఎందుకు బలవుతున్నారు? పోస్టింగుల్లో సామాజిక న్యాయం ఎక్కడ? పోలీసులపై పెరుగుతున్న ఒత్తిడి! జూబ్లీహిల్స్ కేసులో అసలు బాధ్యులెవరు? ముత్తు యాదవ్‌పైనే ఎందుకు వేటు? ప్రవీణ్ కుమార్ సంచలన ప్రశ్నల వర్షం హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో ప్రస్తుతం గ్యాంగ్‌వార్ తరహా పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసుల నమోదు, అరెస్టులు, దర్యాప్తులు అన్నీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకే జరుగుతున్నాయంటూ విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో జరిగినట్లు చెబుతున్న ఘటనతో పాటు రాష్ట్రంలోని పోలీసు పోస్టింగ్‌ల వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌కు సంబంధించిన కేసులో కింది స్థాయి అధికారిపై చర్యలు తీసుకున్నారని, అయితే సంబంధిత ఉన్నతాధికారుల పాత్రపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్‌ను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హరికృష్ణ అనే వ్యక్తిపై దాడి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని, గాయాలతో చికిత్స పొందిన తర్వాత కూడా వెంటనే కేసు నమోదు కాలేదని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. సాధారణంగా ఎవరైనా దాడికి గురైతే బాధితుడిని ఆస్పత్రికి తరలించి, ఫిర్యాదు నమోదు చేయడం పోలీసుల విధి అని పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో ఎందుకు వెంటనే చర్యలు తీసుకోలేదనే అంశంపై స్పష్టత ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. దాడి సమయంలో పోలీసు కానిస్టేబుళ్లు అక్కడికి ఎలా చేరుకున్నారనే అంశంపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చారు? అత్యవసర నంబర్‌కు ఫోన్ వచ్చిందా? అనే విషయాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. బాధితుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లిన తర్వాత సాధారణ నమోదు ఎందుకు చేయలేదని, కేసు ఎందుకు నమోదు కాలేదని ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖ కార్యాలయ ప్రత్యేకాధికారి సుమంత్‌పై వచ్చిన ఆరోపణల విషయంలో సమగ్ర దర్యాప్తు జరగాలని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సుమంత్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే విషయంపై పోలీసులు స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఈ వ్యవహారంలో ఎవరినైనా రాజకీయంగా కాపాడుతున్నారా అనే అనుమానాలకు సమాధానం చెప్పాలని కోరారు. జూబ్లీహిల్స్ ఘటనలో సీఐపై మాత్రమే చర్యలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని, ఆ వ్యవహారంలో ఉన్నతాధికారుల బాధ్యతను కూడా నిర్ధారించాలని పేర్కొన్నారు. కేసు నమోదు ప్రక్రియలో ఎక్కడ లోపం జరిగిందో సమగ్రంగా విచారించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసు పోస్టింగ్‌ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించడం లేదని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. కొంతమంది అధికారులకు కీలక ప్రాంతాల్లో పోస్టింగ్‌లు లభిస్తుండగా, పేద కుటుంబాల నుంచి వచ్చిన