Kaizer News

పేర్లు సూచించిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా..

పేర్లు సూచించిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా..

· City - Hyderabad · prabhanews.com

దట్స్‌ ది స్పిరిట్‌’ అంటూ రేవంత్‌ రెడ్డి స్పందన కాకతీయ వారసత్వం ప్రతిబింబించేలా విమానాశ్రయ డిజైన్‌.. 2028 జూన్‌ 2 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం వరంగల్‌, ఆంధ్రప్రభ : వరంగల్‌ మామునూరు అంతర్జాతీయ విమానాశ్రయం పేరు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. విమానాశ్రయానికి పేరు సూచించాలంటూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి చేసిన పిలుపునకు వరంగల్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా స్పందించారు. రెండు పేర్లను సూచిస్తూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘రుద్రమ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (RIA)’, ‘కాకతీయ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (KIA)’ పేర్లను పరిశీలించాలని కోరారు. వరంగల్‌ ఘనమైన చరిత్ర, కాకతీయుల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే పేరు ఉంటే అర్థవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. వంగా సూచనకు సీఎం రిప్లై.. ‘దట్స్‌ ది స్పిరిట్‌’ సందీప్‌రెడ్డి వంగా చేసిన సూచనకు సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. “That’s the SPIRIT..!!” అని రిప్లై ఇచ్చారు. ఈ చిన్న స్పందన సినీ వర్గాల్లోనూ ఆసక్తిని రేపింది. ప్రస్తుతం సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్‌ కథానాయకుడిగా ‘స్పిరిట్‌’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీంతో సీఎం స్పందనలోని ‘స్పిరిట్‌’ పదంపై సినీ అభిమానులు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ‘అదే నా సినిమాలోని లైన్‌’.. వంగా ఆసక్తికర స్పందన రేవంత్‌రెడ్డి స్పందనపై సందీప్‌రెడ్డి వంగా కూడా తిరిగి స్పందించారు. “That’s the Spirit” అనేది తాను తెరకెక్కిస్తున్న ‘Spirit’ సినిమాలో రాసిన డైలాగ్‌ అని తెలిపారు. ముఖ్యమంత్రి నుంచి అదే పదాలు రావడం తనకు ఆశ్చర్యంగా, ఆనందంగా ఉందని పేర్కొన్నారు. దీంతో ఎయిర్‌పోర్టు పేరు సూచనతో మొదలైన ఈ సోషల్‌ మీడియా సంభాషణకు సినీ కోణం కూడా జతైంది. అయితే ‘రుద్రమ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌’, ‘కాకతీయ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌’ పేర్లు ప్రస్తుతం సందీప్‌రెడ్డి వంగా చేసిన సూచనలు మాత్రమే. విమానాశ్రయానికి ప్రభుత్వం అధికారికంగా తుది పేరు ప్రకటించలేదు. ముఖ్యమంత్రి ప్రజల నుంచి పేర్లపై సూచనలు కోరిన నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు, ఇతరులు కూడా తమ ప్రతిపాదనలు చేస్తున్నారు. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల ‘సమ్మక్క-సారలమ్మ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌’ పేరును సూచించగా, నటుడు–నిర్మాత బండ్ల గణేశ్‌ ‘రాణి రుద్రమదేవి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌’ పేరును సూచించినట్లు తాజా కథనాలు పేర్కొంటున్నాయి. పేర్ల చర్చకు మించి మామునూరు విమానాశ్రయ ప్రాజెక్టు పనులు కూడా ముందుకు సాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రకారం విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ పూర్తయింది. సెప్టెంబర్‌ 2న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడితో సమావేశమైన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మామునూరు ఎయిర్‌పోర్టు టెండర్లను త్వరగా పిలిచి పనులు ప్రారంభించాలని కోరారు. ఆ సమయంలో టెండర్లను రెండు వారాల్లో పిలిచి డిసెంబర్‌లో ఖరారు చేసి అదే నెలలో పనులకు శంకుస్థాపన చేపట్టేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఇక జూలైలో జరిగిన సమావేశంలో మామునూరు విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద

Original source: prabhanews.com
Read more on Kaizer News