Kaizer News

Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా..

Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!

· Entertainment · ntvtelugu.com

Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం! : --> Add as a preferred source on google Baby Nakshatra on Irumudi Movie: రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా ప్రస్తుతం విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ సినిమాలో మణికంఠ అలియాస్ మణమ్మ పాత్రలో నటించిన చిన్నారి నక్షత్రకు మంచి గుర్తింపు దక్కింది. కేరళకు చెందిన ఈ బాలనటి సోషల్ మీడియా రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని.. ఇరుముడితో తెలుగు తెరకు పరిచయమైంది. సినిమాలో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో.. నక్షత్ర పేరు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. నక్షత్ర ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన రీల్స్‌ను చూసిన దర్శకుడు శివ నిర్వాణ ఆమెను సినిమాలో తీసుకోవాలని భావించారట. ముందుగా నక్షత్ర తల్లిని సంప్రదించి.. హైదరాబాద్‌లో ఆడిషన్స్ నిర్వహించారు. ఆ ఆడిషన్స్‌లో నక్షత్ర ఎంపికైంది. అలా ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే ఇరుముడిలో కీలకమైన మణమ్మ పాత్రను దక్కించుకుంది. ఇప్పటివరకు నక్షత్ర తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి దాదాపు ఆరు సినిమాల్లో నటించింది. మలయాళంతో పాటు కన్నడలో శివరాజ్ కుమార్ నటించిన సినిమాలోనూ ఆమె కనిపించింది. ఇరుముడిలో నక్షత్ర నటనకు ఫిదా అయిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ.. భవిష్యత్తులో ఆమెను లీడ్ యాక్టర్‌గా పరిచయం చేస్తామని ప్రకటించడం విశేషం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నక్షత్ర తన సినీ ప్రయాణంతో పాటు ఇరుముడి షూటింగ్‌లో ఎదురైన అనుభవాలను పంచుకుంది. ‘తెలుగు భాష మొదట్లో నాకు పెద్ద సవాలుగా అనిపించింది. కొన్ని చిన్నచిన్న తెలుగు పదాలు అర్థమైనప్పటికీ.. మాట్లాడటం మాత్రం కష్టంగా ఉండేది. సినిమాలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. ట్రాన్స్‌లేటర్ సహాయంతో తెలుగు డైలాగులను మలయాళంలోకి అనువదించుకుని, వాటిని చదువుతూ సంభాషణలను నేర్చుకున్నా. మొదట్లో పెద్ద పెద్ద డైలాగులు చూసి భయపడ్డా. అయితే సెట్‌లో దర్శకుడు శివ నిర్వాణతో పాటు యూనిట్ సభ్యులంతా ఇచ్చిన ప్రోత్సాహంతో ధైర్యంగా నటించగలిగా. తెలుగు, మలయాళ భాషల్లో కొన్ని పదాలు ఒకేలా ఉంటాయి. ముఖ్యంగా అమ్మ, నాన్న వంటి పదాలు రెండు భాషల్లోనూ ఒకే విధంగా ఉండటం నాకు సులభంగా అనిపించింది’ అని నక్షత్ర తెలిపింది. ఇరుముడిలో నాకు బాగా నచ్చిన సన్నివేశం నీటిలో వస్తువులు వేసే సీన్. నీటిలో ఆడుకోవడం నాకు ఇష్టం, అందుకే ఆ సన్నివేశాన్ని బాగా ఎంజాయ్ చేశా. సినిమాలోని ప్రతి సన్నివేశం నాకు ఇష్టమే. ఇరుముడి చూసినప్పుడు నేను ఎంతో ఏడ్చా. ప్రేక్షకులు కూడా సినిమాను చూసేటప్పుడు టిష్యూలు వెంట తీసుకెళ్లాలని సరదాగా చెప్పారు. నాకు తెలుగు సినిమాల గురించి పెద్దగా అవగాహన లేదని, నేను ఎక్కువగా మలయాళ సినిమాలనే చూస్తా. అయితే ఇరుముడి షూటింగ్ సమయంలో హీరో రవితేజ నాతో ఇంగ్లీష్‌లో మాట్లాడేవారు. అంతేకాకుండా కొన్ని తెలుగు పదాలను కూడా నేర్పించారు. అవి నాకు ఎంతో సహాయపడ్డాయి’ అని బేబీ నక్షత్ర చెప్పింది. ‘ప్రస్తుతం నేను ఏడో తరగతి చదువుతున్నా. నా తదుపరి చిత్రం డాడ్ విడుదలకు సిద్ధంగా ఉంది. షూటింగ్‌లు, ఇంటర్వ్యూలకు మా అమ్మతో పాటు మేనమామ కూడా న వెంట వస్తారు. తెలుగు ప్రేక్షకు

Original source: ntvtelugu.com
Read more on Kaizer News