Kaizer News

సైప్రస్‌లో ప‌డ‌వ బోల్తా… ఆరుగురు మృతి..

సైప్రస్‌లో ప‌డ‌వ బోల్తా… ఆరుగురు మృతి..

· National - India · prabhanews.com

బోడ్రమ్, ఆంధ్రప్రభ : ఉత్తర సైప్రస్ తీరంలో ఘోర సముద్ర ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 270 మంది ప్రయాణికులు, సిబ్బందితో ప్రయాణిస్తున్న ఫెర్రీ ఆదివారం సముద్రంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు కనీసం ఆరుగురు మృతి చెందినట్లు టర్కీ మీడియా వెల్లడించింది. మరో 172 మందికి పైగా ప్రయాణికులను రక్షించినట్లు ఉత్తర సైప్రస్ ప్రధాని ఉనాల్ ఉస్టెల్ తెలిపారు. కటమరాన్ తరహాలో ఉన్న ఈ ప‌డ‌వ‌ ఉత్తర సైప్రస్‌లోని కైరేనియా నౌకాశ్రయం నుంచి టర్కీలోని మెర్సిన్ ప్రావిన్స్‌లో ఉన్న టాసుకు నౌకాశ్రయానికి వెళ్తోంది. అయితే, తీరానికి సుమారు 7.5 కిలోమీటర్ల (4.7 మైళ్ల) దూరంలో ఉన్నప్పుడు నౌకలోకి నీరు రావడం ప్రారంభమైందని టర్కీ ప్రభుత్వ మీడియా నివేదించింది. పరిస్థితి విషమించడంతో, ప‌డ‌వ‌ సముద్రంలో బోల్తా పడింది. దీంతో సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. హెలికాప్టర్లు, పడవల సహాయంతో చిక్కుకుపోయిన ప్రయాణికులను ఒడ్డుకు తరలించే చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 172 మందికి పైగా రక్షించగా, మిగిలిన వారి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News