Kaizer News

2027 వన్డే వరల్డ్ కప్ ప్లాన్‎లో తిలక్.. శ్రేయస్‌‌క

2027 వన్డే వరల్డ్ కప్ ప్లాన్‎లో తిలక్.. శ్రేయస్‌‌కు టెన్షన్

· International · v6velugu.com

హైదరాబాద్‌‌: వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌‌ను దృష్టిలో పెట్టుకుని టీమ్‌‌ఇండియా ఇప్పటి నుంచే జట్టు కూర్పుపై కసరత్తు చేస్తోంది. నంబర్‌‌-4లో కీలకంగా ఉన్న శ్రేయస్‌‌ అయ్యర్‌‌కు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌‌ యువ బ్యాటర్‌‌ తిలక్‌‌ వర్మను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. హెడ్‌‌కోచ్‌‌ గౌతమ్‌‌ గంభీర్‌‌, కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ కొత్త కాంబినేషన్‌‌పై ఫోకస్‌‌ పెట్టినట్లు సమాచారం. దక్షిణాఫ్రికా బౌన్సీ పిచ్‌‌లపై శ్రేయస్‌‌ ప్రదర్శన, ఫిట్‌‌నెస్‌‌, ఫీల్డింగ్‌‌ అంశాలను మేనేజ్‌‌మెంట్‌‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టాప్‌‌-6లో లెఫ్ట్‌‌హ్యాండర్‌‌ లేకపోవడంతో తిలక్‌‌కు అదనపు అడ్వాంటేజ్‌‌ ఉంది. హార్దిక్‌‌ పాండ్యా, నితీశ్‌‌ కుమార్‌‌ రెడ్డి గాయాల నేపథ్యంలో తిలక్‌‌ తన ఆఫ్‌‌స్పిన్‌‌ను కూడా మెరుగుపరుచుకోవాలని టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ సూచించినట్లు సమాచారం. తిలక్‌‌ భారత్‌‌ తరఫున 59 టీ20లు, 5 వన్డేలు ఆడాడు. దేశవాళీ లిస్ట్‌‌-ఏలో 52 మ్యాచ్‌‌ల్లో 2,142 పరుగులు, 6 సెంచరీలతో 47.60 సగటు నమోదు చేశాడు. అక్టోబర్‌‌ న్యూజిలాండ్‌‌ వన్డే సిరీస్‌‌ నుంచే వరల్డ్‌‌కప్‌‌ ప్రణాళికలు అమలు చేసే అవకాశం ఉంది

Original source: v6velugu.com
Read more on Kaizer News