Kaizer News

ఖమ్మం-హైదరాబాద్ హైవేపై కారులో మంటలు.. ప్రముఖ న్యూర

ఖమ్మం-హైదరాబాద్ హైవేపై కారులో మంటలు.. ప్రముఖ న్యూరో సర్జన్ సజీవదహనం

· City - Hyderabad · v6velugu.com

ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిల్లలమర్రి సమీపంలో అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి మృతి చెందాడు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఎస్సై అనిల్ రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని ఖమ్మంలోని మమత ఆసుపత్రి సీనియర్ డాక్టర్ న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్ (50)గా గుర్తించారు. ప్రమాదం ఎలా జరిగింది? కారు అదుపుతప్పడానికి కారణమేంటి? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిగా దగ్ధమైన కారును పరిశీలించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. డాక్టర్ జగదీష్ మృతితో వైద్య వర్గాల్లోనూ విషాదం అలుముకుంది

Original source: v6velugu.com
Read more on Kaizer News