Kaizer News

Tamil Nadu | టైరు పేలి కారు బోల్తా.. నలుగురు విద్య

Tamil Nadu | టైరు పేలి కారు బోల్తా.. నలుగురు విద్యార్థులు మృతి..

· National - India · prabhanews.com

Tamil Nadu | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదురాంతగం సమీపంలో ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న కారు టైరు ఒక్కసారిగా పేలడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. దీంతో కారు రోడ్డుపై పల్టీలు కొట్టినట్లు సమాచారం. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Original source: prabhanews.com
Read more on Kaizer News