Kaizer News

Vikarabad: మీడియా గొంతు నొక్కితే ప్రజాస్వామ్యం మూగ

Vikarabad: మీడియా గొంతు నొక్కితే ప్రజాస్వామ్యం మూగబోతుంది.. మెతుకు ఆనంద్!

· City - Hyderabad · hmtvlive.com

Vikarabad: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని లాలాగూడ సమీపంలోని శివకేశవ బ్యాంకేట్ హాల్ నిర్వహించిన నవ తెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు ఈ సందర్భంగా డాక్టర్ మెతుకు ఆనంద్ గారు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, ప్రజల గొంతుకగా నిలవడంలో పత్రికా రంగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా పనిచేస్తూ, సమాజంలోని సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. నవ తెలంగాణ దినపత్రిక గత 11 సంవత్సరాలుగా ప్రజా సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని, సామాన్య ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో తనదైన పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుతమైన, బాధ్యతాయుతమైన జర్నలిజం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజల పక్షాన మరింత బలంగా నిలుస్తూ, వాస్తవాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువెళ్తూ నవ తెలంగాణ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నవ తెలంగాణ ప్రతినిధులు, పాత్రికేయులు, సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నవ తెలంగాణ 11వ వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, పాత్రికేయ మిత్రులకు మరియు పాఠకులకు మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు

Original source: hmtvlive.com
Read more on Kaizer News