Kaizer News

Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్య

Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్

· National - India · ntvtelugu.com

తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్ నేపాల్‌లో తప్పిన ఘోర విషాదం 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్ క్షణాల్లో మునిగిన స్కూల్ Follow Us : --> Add as a preferred source on google నేపాల్ జలప్రళయం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిందో అందరికీ తెలిసిందే. అకస్మాత్తుగా వచ్చిన విలయానికి ఎందరో జలసమాధి అయ్యారు. ఇప్పటికే 700 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు చూస్తుంటే.. భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. నేపాల్‌లో సంభవించిన భారీ వరదల్లో ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సమయస్ఫూర్తి 1,643 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడింది. హిమనదం (గ్లేసియర్) కూలిపోవడంతో అకస్మాత్తుగా సంభవించిన వరదలు భారీ విధ్వంసాన్ని సృష్టించిన సమయంలో.. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన పాఠశాల ప్రిన్సిపల్ రాజేంద్ర దవాడీ వెంటనే స్పందించి విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీంతో పిల్లలంతా క్షేమంగా బయటపడడంతో తల్లిదండ్రులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నేపాల్‌లోని త్రిశూలీ లోయలో ఉన్న త్రిభువన్ త్రిశూలీ సెకండరీ స్కూల్ ప్రిన్సిపల్ రాజేంద్ర దవాడీకి బుధవారం ఉదయం 9.20 గంటలకు ఓ స్నేహితుడి నుంచి ఫోన్ వచ్చింది. “గ్రామం మొత్తం కొట్టుకుపోయింది.. నదిలో కలిసిపోయింది. వెంటనే పరుగెత్తు” అంటూ అతడు హెచ్చరించాడు. ఆ సమయంలో పాఠశాలలో చుట్టుపక్కల కలిపి మొత్తం 1,643 మంది విద్యార్థులు ఉన్నారు. హిమనదం కూలిపోవడంతో పర్వత ప్రాంతంలోని నదుల్లో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. రాళ్లు, మంచు, బురద, భారీ శిథిలాలతో కూడిన వరద ప్రవాహం గ్రామాలను ముంచెత్తింది. భవనాలు, వంతెనలు, విద్యుత్ కేంద్రాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. 47 ఏళ్ల రాజేంద్ర దవాడీ ఇంగ్లిష్ టీచర్‌గా కూడా పనిచేస్తున్నారు. తొలుత పాఠశాలకు ఎలాంటి ప్రమాదం ఉండదని ఆయన భావించారు. కాంక్రీట్‌తో నిర్మించిన మూడు అంతస్తుల భవనం నదికి సుమారు 60 మీటర్ల ఎత్తులో ఉంది. అంతేకాకుండా గ్రామాన్ని తూర్పు ఒడ్డుతో కలిపే స్టీల్ బ్రిడ్జ్‌కు సమాన స్థాయిలో పాఠశాల ఉండటంతో సురక్షితంగానే ఉంటుందని భావించారు. అయితే ఓ విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని నీటిమట్టం వేగంగా పెరుగుతోందని హెచ్చరించారు. దీంతో పరిస్థితి తీవ్రతను గుర్తించిన దవాడీ వెంటనే పాఠశాల గంట మోగించారు. తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులను బయటకు తరలించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం స్కూల్ బస్సు డ్రైవర్లకు ఫోన్ చేసి.. బస్సులను వెనక్కి తిప్పాలని సూచించారు. అయితే ఒక బస్సు డ్రైవర్‌ను మాత్రం ఆయన సంప్రదించలేకపోయారు. అప్పటికే ఆ బస్సు వంతెన దాటుతున్నట్లు ఆయన గమనించారు. వరద ముప్పు తీవ్రంగా ఉందని విద్యార్థులు కూడా గుర్తించారు. ఓ బాలిక తీవ్ర భయాందోళనకు గురై పానిక్ అటాక్‌కు లోనైంది. ఆమెను మోటార్‌సైకిల్‌పై ఎత్తైన ప్రాంతానికి తరలించారు. మిగిలిన విద్యార్థులు కాలినడకన సురక్షిత ప్రాంతం వైపు పరుగులు తీశారు. ప్రిన్సిపల్ దవాడీ కూడా వారి వెంటే వెళ్లారు. చివరకు విద్యార్థులంతా ఓ బోధి చెట్టు కింద ఆశ

Original source: ntvtelugu.com
Read more on Kaizer News