తమిళ, మళయాళ సినిమాలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రాలు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో ఇంట్రెస్టింగ్ సినిమా ఒకటి చేరింది. అదే ‘మొద రాతిరి’ (Modha Rathiri). పెళ్లి, కుటుంబ ఒత్తిళ్లు, ఊహించని పరిణామాల చుట్టూ సాగే ఈ డార్క్ కామెడీ డ్రామా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. రిషికాంత్, అనిష్మా అనిల్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మొద రాతిరి’ చిత్రం ఆగస్టు 21, 2026న థియేటర్లలో విడుదలైంది. అనంతరం నిన్న సెప్టెంబర్ 18న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో వివిధ భాషల ప్రేక్షకులు తమకు నచ్చిన భాషలో సినిమాను చూసే అవకాశం లభించింది. ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించడం ప్రత్యేకతగా నిలిచింది. విభిన్న కథాంశంతో తెరకెక్కిన తమిళ సినిమాను తెలుగు ప్రేక్షకులకు సైతం అందుబాటులోకి తీసుకురావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కథలో ఇంట్రెస్టింగ్ గా సాగే కామెడీ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో ప్రస్తుతం మూవీ ట్రెండింగ్ లో నిలిచింది ‘మొద రాతిరి’ సినిమా కథ ఒక గ్రామీణ ప్రాంతంలో జరిగే పెళ్లి వేడుక చుట్టూ తిరుగుతుంది. కుటుంబ సభ్యుల నిర్ణయానికి అనుగుణంగా పెళ్లికి సిద్ధమైన ఓ యువతి, ఓ యువకుడు.. పెళ్లి తర్వాత ఒకరి గురించి మరొకరు తెలుసుకున్న నిజాలతో ఊహించని పరిస్థితుల్లో చిక్కుకుంటారు. వివాహం పూర్తయిన తర్వాత తమ జీవితాల గురించి కొన్ని కీలక విషయాలను పరస్పరం పంచుకునే ఈ నూతన వధూవరులు.. మొదటి రాత్రి సమయంలో అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటారు. అయితే ఈ నిర్ణయం కుటుంబ సభ్యులకు ఎలాంటి షాక్ ఇస్తుంది? ఆ తర్వాత వారిద్దరి ప్రయాణం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అనేదే సినిమా మిగతా కథ. ఇద్దరు అపరిచితులు పెళ్లి తర్వాత కలిసి తీసుకునే నిర్ణయం నుంచి కథలో అసలు వినోదం మొదలవుతుంది. వారు ఎదుర్కొనే గందరగోళ పరిస్థితులు, కుటుంబ సభ్యుల ప్రతిస్పందనలు, అనూహ్య పరిణామాలు కథను ముందుకు నడిపిస్తాయి. కామెడీతో పాటు భావోద్వేగాలు, ఉత్కంఠను మేళవిస్తూ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సాధారణ పెళ్లి కథకు భిన్నంగా డార్క్ కామెడీ టచ్‌తో రూపొందిన ఈ చిత్రం.. కథనం, పాత్రల ప్రవర్తన, ఊహించని సన్నివేశాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత చోటుచేసుకునే పరిణామాలను వినోదాత్మకంగా చూపించడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తమిళ చిత్రసీమకు చెందిన ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. కొత్త తరహా కథాంశంతో రూపొందిన సినిమాను ఓటీటీ ద్వారా వివిధ భాషల ప్రేక్షకులకు చేరువ చేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ‘మొద రాతిరి’.. వీకెండ్‌లో డిఫరెంట్ కంటెంట్‌ను ఆస్వాదించాలనుక