Kaizer News

ఉదయాన్నే రన్నింగ్.. యోగా.. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్..

ఉదయాన్నే రన్నింగ్.. యోగా.. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. హైదరాబాద్‌లో కొత్త ట్రెండ్

· City - Hyderabad · v6velugu.com

ఒకప్పుడు క్లబ్ అంటే పార్టీలు.. జిమ్ అంటే వర్క్అవుట్​.. స్పా అంటే రిలాక్సేషన్! కానీ ఇప్పుడు సీన్ మారింది. హైదరాబాద్​లో ఫిట్‌నెస్‌తోపాటు మైండ్‌ఫుల్‌నెస్.. వర్క్​అవుట్‌తో పాటు సోషల్ కనెక్షన్​కు ప్రాధాన్యం పెరుగుతోంది. యోగా.. మెడిటేషన్.. రన్నింగ్.. పికిల్‌బాల్.. హెల్దీ ఫుడ్.. వీకెండ్ యాక్టివిటీస్.. ఇలా అన్నింటినీ ఒకే లైఫ్‌స్టైల్‌గా మార్చేస్తున్నాయి వెల్‌నెస్ కమ్యూనిటీలు. అసలు హైదరాబాద్‌లో ఈ కొత్త వెల్‌నెస్ కల్చర్ ఎందుకు పెరుగుతోంది? నగరవాసులను ఇంతగా ఆకట్టుకుంటున్న ఈ కొత్త ట్రెండ్ ఏంటి? బిజీ లైఫ్.. గంటల తరబడి ఆఫీస్ వర్క్.. పెరుగుతున్న స్క్రీన్ టైమ్.. మారుతున్న జీవనశైలి! ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించడం చాలామందికి కష్టంగా మారింది. దీంతో వ్యాయామాన్ని ఒక పని లాగ కాకుండా.. లైఫ్‌‌స్టైల్ ఎక్స్‌‌పీరియన్స్‌‌గా మార్చుకుంటున్నారు హైదరాబాద్ వాసులు. కేవలం బాడీని ఫిట్‌‌గా ఉంచడం మాత్రమే కాదు.. మనసుకు ప్రశాంతత, మంచి ఆహారం, రికవరీ, మంచి నిద్ర, కొత్త పరిచయాలు.. ఇలా వెల్‌‌నెస్‌‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఒకే కమ్యూనిటీలో కలుపుతున్నారు. యోగా, మెడిటేషన్ క్లాసుల నుంచి రన్నింగ్ క్లబ్‌‌ల వరకు.. పికిల్‌‌బాల్ వంటి కొత్త స్పోర్ట్స్ నుంచి వీకెండ్ వెల్‌‌నెస్ యాక్టివిటీస్ వరకు.. హైదరాబాద్‌‌లో కొత్త తరహా కమ్యూనిటీలు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్‌‌కు 50 కిలోమీటర్ల దూరంలోని రంగారెడ్డి జిల్లాలోని చేగూరు గ్రామం సమీపంలో ఉన్న కన్హా శాంతివనంలోని1400 ఎకరాల సుందరమైన ప్రాంగణంలో హార్ట్‌‌ఫుల్‌‌నెస్ ఇన్‌‌స్టిట్యూట్ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కేంద్రంలో ఒకేసారి లక్ష మంది ధ్యానం చేసుకునే సామర్థ్యం ఉంది. హైదరాబాద్​లోని బంజారాహిల్స్, గచ్చిబౌలిలో ద వెల్​నెస్ కో, మౌలాలీలో నేచురల్ వెల్​నెస్ క్లబ్, తార్నాకలో లైఫ్ బ్లూమ్ వెల్​నెస్ క్లబ్, జూబ్లీహిల్స్​లో హాలిస్టిక్ వెల్​నెస్ క్లినిక్, విజయనగర్ కాలనీలో బాడీ రీసెట్ వెల్​నెస్ సెంటర్, మణికొండలో బోధి వెల్​నెస్ సెంటర్, బేగంపేటలో మెగావీ వెల్​నెస్ స్పా కేంద్రాలు వెలిశాయి. ఖైరతాబాద్​లోని బోధి యోగా స్టూడియోలో నిత్యం యోగా శిక్షణ తరగతులతోపాటు ఆన్​లైన్ క్లాసులు కూడా నిర్వహిస్తోంది. కొండాపూర్​లోని ప్రాణ యోగా ఫిట్​నెస్ సెంటర్, బంజారాహిల్స్​లోని షర్మిల యోగా జోన్​లలో అష్టాంగ యోగా, హఠ యోగా, పవర్ యోగా, ప్రెగ్నెన్సీ యోగా, యోగా థెరపీలతోపాటు ఆన్ లైన్ కార్పొరేట్ యోగా సెషన్​లు, ప్రాణాయామం, మెడిటేషన్ సెషన్లను నిర్వహిస్తోంది. మణికొండ ఆదిత్య ఫోర్ట్ వ్యూ విల్లాస్​లోని అష్టయోగాలో వెయిట్​లాస్, కార్డియో, స్ట్రెస్ రిలీఫ్ యోగా శిక్షణ ఇస్తున్నారు. సద్గురు ఈషా హఠ యోగా యోగిక్యూలో హఠ యోగా టీచర్ ట్రైనింగ్ తరగతులు నిర్వహిస్తున్నారు. సిటీలోని సంయోగా స్టూడియో, కల్పతా యోగా జుంబా డ్యాన్స్, సుశీల్ యోగా, ఎనర్జైజర్ యోగా, అభిరాం యోగాశాల, ఆర్య యోగా అండ్ వెల్​నెస్ ఇన్ స్టిట్యూట్, అభ్యాసయోగా, ఆర్యజననీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్, నమస్తే ఇండియా పాఠశాల ఆఫ్ యోగా, వర్తమాన్ యోగా, నిశాంత్ యోగా సెంటర్లలో సిటీవాసులు యోగా చేస్తున్నారు. రామకృష్ణ మఠంలో పలు ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. నిత్య పూజలు, భజనలతోపాటు జపసా

Original source: v6velugu.com
Read more on Kaizer News