Kaizer News

Vijay Deverakonda | బాలాపూర్ గణనాథుడిని దర్శించుకు

Vijay Deverakonda | బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ.!

· Entertainment · ntnews.com

హైదరాబాద్: నగరమంతా గణేష్ ఉత్సవ శోభతో కళకళలాడుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ శనివారం రాత్రి ప్రసిద్ధ బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు పట్లోళ్ల కౌశిక్‌ రెడ్డితో కలిసి బాలాపూర్ మండపానికి వచ్చిన విజయ్, గణపతికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఆయన రాకతో ఉత్సవ ప్రాంగణం ఒక్కసారిగా జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి బృందం విజయ్ దేవరకొండను శాలువాతో సత్కరించి, బాలాపూర్ ప్రసిద్ధ లడ్డూను ప్రసాదంగా అందజేశారు. విజయ్ ని చూడగానే అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది. ఫోటోలు, సెల్ఫీల కోసం యువత ఎగబడ్డారు. “విజయ్ అన్న” అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అభిమానుల ఉత్సాహాన్ని చూసి విజయ్ కూడా అభివాదం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు

Original source: ntnews.com
Read more on Kaizer News