Kaizer News

Hyderabad: లోకాయుక్త కాలనీలో ఉచిత వైద్య శిబిరం: 35

Hyderabad: లోకాయుక్త కాలనీలో ఉచిత వైద్య శిబిరం: 350 మందికి పరీక్షలు

· City - Hyderabad · hmtvlive.com

Shorts హైదరాబాద్: లోకాయుక్త కాలనీ అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసిన కీర్తిశేషులు జగన్ గౌడ్, సీహెచ్ నర్సింగ్‌రావు సేవలను స్మరించుకుంటూ లోకాయుక్త కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. చిత్రం జీవన్‌కుమార్ ఆధ్వర్యంలో కాలనీ అసోసియేషన్ పార్క్‌లో నిర్వహించిన ఈ శిబిరానికి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్, కలాం ఫౌండేషన్, యశోద హాస్పిటల్, శ్రీ నేత్రాలయ సహకారం అందించారు. శిబిరంలో సుమారు 350 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందజేశారు. కీర్తిశేషులు జగన్ గౌడ్, సీహెచ్ నర్సింగ్‌రావు కాలనీకి అందించిన సేవలను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా కాలనీవాసులకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ సభ్యులు బల్వంత్‌రెడ్డి, హరీష్, యాదయ్య, ఆసుపత్రుల వైద్య సిబ్బంది, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News