అంతరిక్షరంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించాక, ఎంతటి విజయాలు లభిస్తున్నాయో చూస్తున్నామని.. అదే తరహాలో అణు ఇంధన రంగంలోనూ వాణిజ్య ఉత్పత్తికి ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించాలని దేశ అణు కార్యక్రమంతో 5 దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్న టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ (టీసీఈ) కోరింది.