Kaizer News

Hyderabad IMAX Theatre : హైదరాబాద్‌లో IMAX ఓపెనింగ

Hyderabad IMAX Theatre : హైదరాబాద్‌లో IMAX ఓపెనింగ్‌ డేట్ ఫిక్స్ - మహేశ్ బాబు 'వారణాసి'కి ముందే మరో విజువల్ వండర్ స్క్రీనింగ్

· City - Hyderabad · telugu.abplive.com

మూవీ లవర్స్‌కు ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు ఇది సూపర్ గుడ్ న్యూస్. దాదాపు 12 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో IMAX థియేటర్ ఓపెనింగ్‌కు రెడీ అవుతోంది. ప్రముఖ నిర్మాత, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ఓపెనింగ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో మాట్లాడిన ఆయన ఈ ఏడాది చివరికల్లా IMAX రెడీ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబరులో హైదరాబాద్‌లో IMAX థియేటర్ ప్రారంభం కానుందని చెప్పారు సునీల్ నారంగ్. ప్రముఖ హాలీవుడ్ మూవీ 'డూన్ 3' (Dune 3) స్క్రీనింగ్ స్టార్ కాబోతున్నట్లు హింట్ ఇచ్చారు. ఈ మూవీ డిసెంబర్ 18న వరల్డ్ వైడ్ సూపర్ విజువల్స్‌తో IMAX స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. 'IMAX మాత్రమే కాదు. ఇందులో 4DX కూడా ఉంది. మహేశ్ బాబు ఇది కావాలి అని పట్టుబట్టారు. ఆయన ఐడియానే ఇది. ప్రతీ స్క్రీన్ కూడా డిఫరెంట్. వెంకటేశ్, రానా, మహేశ్ బాబు, ఏషియన్ నలుగురూ కలిసి ఈ భారీ IMAX నిర్మాణం చేపట్టాం.' అని వివరించారు. ఆ తర్వాత ఇక విజువల్ వండర్ వారణాసి మూవీ స్క్రీనింగ్ కూడా ఇందులోనే ఉండనుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో రాబోతోన్న ఈ భారీ మూవీ ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటికీ హైదరాబాద్ వాసులకు బిగ్ సిల్వర్ స్క్రీన్‌పై ఓ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అందనుంది. .. వీకెండ్ సూపర్ థ్రిల్ పంచే టాప్ 10 సినిమాలు సిటీ సినిమా క్రేజ్‌కు కేరాఫ్ అడ్రస్‌ ఐమాక్స్. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక టికెట్లు అమ్ముడైన స్క్రీన్‌గా రికార్డు సృష్టించిన హైదరాబాద్ ఐమాక్స్ ఆ తర్వాత కొన్ని కారణాలతో మూతపడింది. 12 ఏళ్లుగా మల్టీప్లెక్స్ ఎక్స్‌పీరియన్స్‌తో సరిపెట్టుకున్న మూవీ లవర్స్ ఇప్పుడు IMAXతో మరో విజువల్ వండర్ ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు. హకీంపేటలో రాబోతున్న ప్రతిష్టాత్మక AMB సినిమాస్‌ ప్రాజెక్టులో భాగంగానే ఈ ఐమాక్స్‌ స్క్రీన్‌ను నిర్మిస్తున్నట్టు సమాచారం. ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్‌తో విక్టరీ వెంకటేశ్, రానా, మహేశ్ బాబు అందరూ కలిసి భాగమై ఈ భారీ థియేటర్ నిర్మాణానికి అడుగులు వేశారు. .. హైదరాబాద్‌లో వరల్డ్ లార్జెస్ట్ స్క్రీన్ ఏర్పాటుకు రెడీ NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. Up Next Up Next Up Next Up Next చొక్కా విప్పిన సల్మాన్... ట్రోలర్లకు కౌంటర్... కత్రినాకు సపోర్ట్ హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ అమరావతి ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్ హైదరాబాద్ ఫైటర్ ఉపఎన్నికకు రెడీ..! దానం నాగేందర్ సుప్రీంకోర్

Original source: telugu.abplive.com
Read more on Kaizer News