Kaizer News

సారధి స్టూడియో మాదే..! అప్పుడు అమ్మేసాం.. ఆ భూమి ధ

సారధి స్టూడియో మాదే..! అప్పుడు అమ్మేసాం.. ఆ భూమి ధర ఇప్పుడు వేల కోట్లు పెరిగింది

· Entertainment · tv9telugu.com

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో జి.వి. నారాయణరావు ఒకరు. ఇటీవలే ఆయన తుది శ్వస విడిచారు. నటుడిగానే కాదు నిర్మాతగానూ రాణించారు జి.వి. నారాయణరావు. 1976లో వచ్చిన అంతులేని కథ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆయన.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. హీరోగా, సహాయ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే నారాయణరావు గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంతో పాటు అప్పటి సినీ పరిశ్రమకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఒకప్పుడు ఎంతో కీలకంగా ఉన్న సారధి స్టూడియోస్ గురించి ఆయన చెప్పిన వివరాలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అమీర్‌పేట ప్రాంతం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటి. మెట్రో రైలు,కమర్షియల్ ప్రాపర్టీ, విద్యా సంస్థలతో నిత్యం సందడిగా కనిపించే ఈ ప్రాంతంలో ఓ సినీ స్టూడియో కూడా ఉంది. అదే సారధి స్టూడియోస్. జి.వి. నారాయణరావు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం అమీర్‌పేటలో ఉన్న విలువైన భూమి ఒకప్పుడు సారధి స్టూడియోస్‌కు సంబంధించినదే. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని భూమి విలువ వేల కోట్ల రూపాయలకు చేరినట్లు ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు సినిమాల నిర్మాణానికి కీలక కేంద్రంగా ఉన్న ఆ ప్రదేశం ఇప్పుడు హైదరాబాద్‌లో అత్యంత విలువైన ప్రాంతాల్లో ఒకటిగా మారిపోయిందని ఆయన గుర్తు చేసుకున్నారు. సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు క్రమంగా తరలివస్తున్న సమయంలో స్టూడియోలకు భారీ అవసరం ఏర్పడిందని నారాయణరావు తెలిపారు. ఆ సమయంలో సారధి స్టూడియోస్ ఏర్పాటుకు అనేక అంశాలు దోహదపడ్డాయని చెప్పారు. సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు రావడం ప్రారంభమైన సమయంలో సారధి స్టూడియోస్‌ను అభివృద్ధి చేయాలనే ఆలోచనకు ప్రాధాన్యత పెరిగిందని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రోత్సాహం కూడా స్టూడియో అభివృద్ధికి ఉపయోగపడిందని ఆయన పేర్కొన్నారు. అప్పటి రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో సినిమాల షూటింగ్‌కు అవసరమైన స్టూడియో సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేవి కావని నారాయణరావు తెలిపారు. దీంతో చల్లపల్లి మహారాజా చల్లపల్లి రామకృష్ణ ప్రసాద్కు చెందిన సారధి బ్యానర్‌ను ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు. తర్వాత నవయుగ ఫిలిమ్స్.. సారధి స్టూడియోస్‌లో 45 శాతం వాటాలను కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే తన తండ్రి 1964లో గుంటకల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్టూడియో నిర్వహణ బాధ్యతలను చేపట్టారని తెలిపారు. సారధి స్టూడియోస్ ప్రారంభమైన సమయంలో అక్కడ కేవలం ఒక ఫ్లోర్ మాత్రమే ఉండేదని నారాయణరావు చెప్పారు. తర్వాత స్టూడియో విస్తరించి మూడు ఫ్లోర్‌లకు చేరిందని తెలిపారు. ఆ తర్వాత సారధి స్టూడియోస్‌లో షూటింగ్‌లు జోరుగా సాగుతూ, మంచి పేరును సంపాదించిందని ఆయన గుర్తుచేసుకున్నారు. సారధి స్టూడియోస్‌ను తర్వాత ఎందుకు అమ్మాల్సి వచ్చిందన్న విషయాన్ని కూడా నారాయణరావు వివరించారు. నవయుగ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉండేదని, కుటుంబ సభ్యుల మధ్య వాటాలు ఉండేవని చెప్పారు. అ

Original source: tv9telugu.com
Read more on Kaizer News