Kaizer News

Tarnaka: తార్నాకలో కాంగ్రెస్ బూత్ ఏజెంట్ల సమావేశం

Tarnaka: తార్నాకలో కాంగ్రెస్ బూత్ ఏజెంట్ల సమావేశం గండికోట కుమార్ హాజరు

· City - Hyderabad · hmtvlive.com

Tarnaka: సీతాఫల్మండి డివిజన్ పరిధిలోని మాణిక్యేశ్వరి నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బూత్ నంబర్లు 210 నుంచి 217 వరకు గల కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీసీసీ ప్రధాన కార్యదర్శి గండికోట కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ ఫేజ్–2 (SIR Phase 2) ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై బూత్ ఏజెంట్లకు పూర్తి అవగాహన కల్పించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో బూత్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ఓటరు జాబితాలో అవసరమైన సవరణలపై ప్రత్యేక దృష్టి సారించాలని గండికోట కుమార్ దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ఓటర్లు ఎవరూ జాబితా నుంచి తప్పిపోకుండా బూత్ ఏజెంట్లు సమన్వయంతో పనిచేయాలని కోరారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News