Kaizer News

యుద్ధం ఇంకా ఉంది!

యుద్ధం ఇంకా ఉంది!

· National - India · sakshi.com

తేల్చిచెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రారంభించి ఆరు నెలలవుతోంది. ఇప్పటికే వందలాది మంది మరణించారు. దాడులకు ముగింపు ఎప్పుడో ఎవరూ చెప్పలేకపోతున్నారు. యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగిస్తామని, పశ్చిమాసియాలో శాంతియుత వాతావరణం నెలకొల్పుతామని మొదట్లో పదేపదే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నేడు మాట మార్చేశారు. ఇరాన్‌పై దాడులను ఆపే విషయంలో తొందరపడడం లేదని అంటున్నారు. వైమానిక దాడులు, దిగ్బంధనం ద్వారా ఇరాన్‌ నాయకత్వాన్ని, సైన్యాన్ని, ఆర్థిక వ్యవస్థను చాలావరకు నాశనం చేశానని ట్రంప్‌ తాజాగా వెల్లడించారు. ఇరాన్‌ను తమ దారికి తెచ్చేందుకు సైనిక చర్యకు బదులుగా, ఆర్థికంగా ఒత్తిడిని పెంచడంపైనే దృష్టి సారిస్తున్నట్లు ట్రంప్‌ ప్రభుత్వం పేర్కొంది. ఇరాన్‌తో వ్యాపారం కొనసాగించే ఏ దేశమైనా లేదా సంస్థ అయినా కఠిన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆంక్షలను ప్రధాన ఆయుధంగా ఉపయోగించాలని అమెరికా నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇరాన్‌ నాయకత్వం ఇప్ప టికే చాలావరకు బల హీన పడిందని డొనాల్డ్‌ ట్రంప్‌ తేల్చిచెప్పారు. వారు (ఇరాన్‌) సైని కులకు జీతాలు చెల్లించడం లేదని, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. ఇరాన్‌ సామర్థ్యం చాలా తక్కువగా ఉందన్నారు. ఇరాన్‌తో ఇప్పటికిప్పుడు చర్చలు ప్రారంభించాలన్న ఉద్దేశం కూడా లేదని స్పష్టంచేశారు. అందుకు సమయం ఉందని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇరాన్‌పై యుద్ధం వల్ల అమెరికాకు 37.5 బిలియన్‌ డాలర్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. పశ్చిమాసియా సంక్షోభానికి దౌత్యపరమైన పరిష్కారం కనిపెట్టేందుకు ఖతార్, పాకిస్తాన్‌లు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. త్వరగా చర్చలు ప్రారంభించాలని అమెరికా, ఇరాన్‌లను కోరుతున్నాయి. మొత్తం సమస్యకు హార్మూజ్‌ జలసంధి కేంద్ర బిందువుగా మారింది. జలసంధిపై పట్టుకోసం అమెరికా, ఇరాన్‌లు ఆరాటపడుతున్నాయి. హార్మూజ్‌ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్‌ అణు కార్యక్రమంపై చర్చలు ప్రారంభించడం లక్ష్యంగా జూన్‌లో కుదిరిన ప్రాథమిక ఒప్పందంపై ట్రంప్‌ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) హైదరాబాద్ లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) ప్రశ్నించినందుకు TDP ఆఫీస్ కు లాక్కెళ్లి కొట్టారు.. చంద్రబాబు, పవన్, లోకేష్ ల హెలికాప్టర్లు ఖర్చు 110 కోట్లా

Original source: sakshi.com
Read more on Kaizer News