‘దసరా’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, తన తదుపరి చిత్రం ‘ది ప్యారడైజ్’తో మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా జరిగిన మీడియా ముఖాముఖిలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ‘దసరా’ సినిమా సమయంలో ప్రమోషన్ల ద్వారా వచ్చిన హైప్ వల్ల ప్రేక్షకులు కేజీఎఫ్ తరహా పూర్తి స్థాయి ఊచకోత సినిమా ఆశించి వచ్చారని, తీరా థియేటర్‌లో వెన్నెల ప్రేమకథ, డ్రామా చూసి మొదట్లో తీవ్ర […]