Kaizer News

Mrunal Thakur Social Thriller OTT : నాలుగేళ్ల తర్వ

Mrunal Thakur Social Thriller OTT : నాలుగేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ మూవీ - సస్పెన్స్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

· Entertainment · telugu.abplive.com

స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్, కోర్ట్ రూమ్ డ్రామా పూజా మేరీ జాన్ (Pooja Meri Jaan). ఈ మూవీ నిర్మాణం 2022లోనే కంప్లీట్ అయినా వివిధ కారణాలతో థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఇప్పుడు డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. 'పూజా మేరీ జాన్' మూవీ దాదాపు నాలుగేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ప్రముఖ ఓటీటీ ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి హిందీలో అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. 'కొన్ని కథలు మీరు చూసే దానిపైనే సందేహం కలిగిస్తాయి. మరికొన్ని మీరు నమ్మే విషయాలనే ప్రశ్నించేలా చేస్తాయి. కానీ ఈ కథ మాత్రం, వాటన్నింటి మధ్య ఉన్న ప్రతి విషయాన్నీ ప్రశ్నించేలా చేస్తుంది.' అంటూ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ మూవీకి నవజ్యోత్ గులాటీ, విషాషా అరవింద్ దర్శకత్వం వహించగా... మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషీ, విక్రమ్ సింగ్ చౌహాన్, విజయ్ రాజ్, చైతన్య వ్యాస్, రాజేష్ జైస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దినేష్ విజన్ మడాక్ ఫిల్మ్స్ మూవీని నిర్మించింది. ీనింగ్ ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే... ఓ యువతి తనను వేధించిన అజ్ఞాత వ్యక్తిని వెతికి పట్టుకునే అంశం చుట్టూ సాగుతుంది. మృణాల్ పూజ అనే యువతి పాత్రలో కనిపించనుంది. ఆమెను ఓ అజ్ఞాత వ్యక్తి వేధిస్తుంటాడు. ఆ సమస్య నుంచి బయటపడేందుకు వాడెవడో కనిపెట్టేందుకు పూజా ప్రయత్నాలు సాగిస్తుంది. ఇందులో భాగంగానే కోర్టు మెట్లెక్కుతుంది. దీని కోసం తన ప్రాణ స్నేహితురాలైన సనా (హుమా ఖురేషీ) సాయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఆమెకు ఊహించని షాక్ తగులుతుంది. అసలు పూజను వేధించిన వ్యక్తి ఎవరు? ఆమె కోర్టును ఎందుకు ఆశ్రయించింది? న్యాయస్థానంలో ఆమెకు న్యాయం జరిగిందా? చివరకు తనను వేధించిన వ్యక్తిని పూజ ఏం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. .. వీకెండ్ సూపర్ థ్రిల్ పంచే టాప్ 10 సినిమాలు NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. Up Next Up Next Up Next Up Next హైదరాబాద్‌లో IMAX ఓపెనింగ్‌ డేట్ ఫిక్స్ - మహేశ్ బాబు 'వారణాసి'కి ముందే మరో విజువల్ వండర్ స్క్రీనింగ్ హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ నల్గొండ హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం రాజమండ్రి కాకినాడ నుంచి రైలు మార్గంలో వుడ్ పల్ప్ రవాణా.. భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం అమరావతి ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త

Original source: telugu.abplive.com
Read more on Kaizer News