Kaizer News

RS Praveen kumar | కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌

RS Praveen kumar | కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ను కాపాడుతుంది రేవంత్ రెడ్డే : ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

· City - Hyderabad · ntnews.com

RS Praveen kumar | కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అరెస్ట్ కాకుండా కాపాడుతుంది రేవంత్ రెడ్డేనని.. బాధితుడిపై జూబ్లీహిల్స్‌లో దాడి జరిగితే మేడిపల్లిలో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదైందని.. జూలై 30వ తేదీన దాడి జరిగితే, బాధితుడు జూలై 31వ తేదీన ఫిర్యాదు చేస్తే కేసు ఆగస్టు 20వ తేదీన ఎందుకు నమోదైంది..? 20 రోజులు కేసు నమోదు కాకుండా సుమంత్‌ను కాపాడింది రేవంత్ రెడ్డే అని బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. మేడిపల్లి మల్కాజిగిరిలో ఉంటది.. జూబ్లీహిల్స్‌ ఏమో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌లో ఉంటది. ఎవరైతే తన్నిర్రో వాడు పోయి సైబరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కేసు పెడ్తడు. ఈ కేసు రిజిస్టర్‌ కాదు. ఇదేదో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలా ఈ గ్యాంగ్‌ల స్వైర విహారం జరుగుతుంది. మేడిపల్లిలో ఒక జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.. ఎందుకంటే బాధితుడు ఎక్కడికైనా పోయి ఫిర్యాదు చేయొచ్చు.. అందుకే దానికి నంబర్ లేదు. ఆగస్టు 20న జీరో ఎఫ్‌ఐఆర్ అయిందన్నారు.. ఈ జీరో ఎఫ్‌ఐఆర్‌లో బాధితుడు హరికృష్ణ.. మేడ్చల్‌ మల్కాజగిరి జిల్లాలో రియల్ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటా. నాకు ఒక రోజు కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌ ఫోన్ చేసిండు. కాల్‌ చేసి నీతో అర్జెంటుగా మాట్లాడే అవసరముంది. నువ్వు రావాలి అంటే నా దగ్గర అప్పుడు కారు లేకుండే.. నా మిత్రుడు కిరణ్‌, ఇంకో మిత్రుడు రాముతో కలిసి జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు కూతవేటు దూరంలో అంటే తెలంగాణ భవన్‌కు దగ్గరలో జూబ్లీ చెక్ పోస్టు ఉన్నది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌ పర్లాంగు దూరంలో జూబ్లీహిల్స్‌ పీఎస్‌ ఉంది.. ఈ మూడింటి (జూబ్లీ చెక్ పోస్టు) దగ్గర ఒక డెన్‌లో వీళ్లంతా మా కోసం వెయిట్‌ చేస్తున్నరు. నా మిత్రుడు కిరణ్‌తో కలిసి మాకు తెలిసిన ఒక రెంటల్ కారులో పోతే అక్కడ మమ్మల్ని సుమంత్‌, నలుగురు రాడ్లతో దాడి చేశారని పేర్కొన్నాడు. కొండా సుష్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వరకు రేవంత్ ఆదేశాలతో సుమంత్‌పై అప్పుడే కేసు నమోదు చేశారు. కానీ సుమంత్‌ను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు ఎందుకు..? 3 వారాల క్రితమే జూబ్లీహిల్స్ సీఐగా ఛార్జ్ తీసుకున్న ముత్తు యాదవ్‌ను ఈ కేసులో అకారణంగా సస్పెండ్ చేశారని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అరెస్ట్ కాకుండా కాపాడుతుంది రేవంత్ రెడ్డే బాధితుడిపై జూబ్లీహిల్స్‌లో దాడి జరిగితే మేడిపల్లిలో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది జూలై 30వ తేదీన దాడి జరిగితే, బాధితుడు జూలై 31వ తేదీన ఫిర్యాదు చేస్తే కేసు ఆగస్టు 20వ తేదీన ఎందుకు నమోదైంది? 20 రోజులు కేసు నమోదు… https://t.co/l87BY8g0VS pic.twitter.com/UcADoZoh33 సెప్టెంబ‌ర్ 1న‌ ఉమ్మడి నల్ల‌గొండ జిల్లా జూనియర్ బాలికల ఫుట్‌బాల్ జట్టు ఎంపికలు Cortisol Face | ముఖం వాపుల‌కు గురైన‌ట్లుగా క‌నిపిస్తుందా.. దీన్ని ఏమంటారు, బ‌య‌ట ప‌డాలంటే ఏం చేయాలి..? Suryapet News | వేపచెట్టు వివాదం.. రెండు నిండు ప్రాణాలు బ‌లి.. ఎస్ఐకి గాయాలు!

Original source: ntnews.com
Read more on Kaizer News