Kaizer News

Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యా

Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి

· National - India · ntvtelugu.com

సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్ సెప్టెంబర్‌లో ఈ తేదీల్లో బ్యాంకులు బంద్ Follow Us : --> Add as a preferred source on google Bank Holidays September 2026: బ్యాంకు ఖాతాదారులకు ముఖ్యమైన అలర్ట్. సెప్టెంబర్ 2026లో దేశవ్యాప్తంగా పలు పండుగలు, ప్రాంతీయ సెలవుల కారణంగా వివిధ రాష్ట్రాలు, నగరాల్లో బ్యాంకు శాఖలు మూసి ఉండనున్నాయి. అయితే అన్ని బ్యాంకు సెలవులు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హాలిడే క్యాలెండర్ ప్రకారం రాష్ట్రం, నగరాన్ని బట్టి బ్యాంకు సెలవులు మారుతాయి. అందువల్ల బ్యాంకు శాఖకు వెళ్లి చేయాల్సిన పనులు ఉన్నవారు ముందుగానే తమ ప్రాంతంలోని బ్రాంచ్ హాలిడే షెడ్యూల్‌ను చెక్ చేసుకోవడం మంచిది. ప్రాంతీయ పండుగలతో పాటు ప్రతి నెలా వచ్చే ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సాధారణ సెలవులు ఉంటాయి. జన్మాష్టమి (వైష్ణవ) / కృష్ణ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 4న పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. గుజరాత్ మిజోరం మధ్యప్రదేశ్ ఒడిశా చండీగఢ్ తమిళనాడు ఉత్తరాఖండ్ సిక్కిం తెలంగాణ రాజస్థాన్ జమ్మూ కశ్మీర్ ఉత్తరప్రదేశ్ కేరళ పశ్చిమ బెంగాల్ బీహార్ ఛత్తీస్‌గఢ్ జార్ఖండ్ మేఘాలయ హిమాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సెప్టెంబర్ 11న రాజస్థాన్‌లోని సంబంధిత బ్యాంకు శాఖలకు సెలవు ఉంటుంది. శ్రీమంత శంకర్‌దేవ తిరుభావ్ తిథి సందర్భంగా సెప్టెంబర్ 12న అసోంలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది. గణేష్ చతుర్థి, గణేష్ పూజ, వినాయక చతుర్థి, వరసిద్ధి వినాయక వ్రతం/చతుర్థి సందర్భంగా సెప్టెంబర్ 14న పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. మహారాష్ట్ర ఒడిశా కర్ణాటక తమిళనాడు గుజరాత్ తెలంగాణ గోవా ఆంధ్రప్రదేశ్ సెప్టెంబర్ 15న సంవత్సరి (చతుర్థి పక్షం), నువాఖై, గణేష్ చతుర్థి రెండో రోజు వంటి పండుగల కారణంగా: గుజరాత్ ఒడిశా గోవా రాష్ట్రాల్లో బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి. అసోం.. శ్రీమంత శంకర్‌దేవ జన్మోత్సవం, కేరళ.. శ్రీ నారాయణ గురు సమాధి కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. కర్మ పూజ సందర్భంగా సెప్టెంబర్ 22న జార్ఖండ్‌లో బ్యాంకు శాఖలు పనిచేయవు. సెప్టెంబర్ 23న జమ్మూ కశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు మహారాజా హరి సింగ్ జీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 23న జమ్మూ కశ్మీర్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఇంద్రజాత్ర పండుగ సందర్భంగా సెప్టెంబర్ 25న సిక్కింలోని బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి. బ్యాంకు సెలవు అంటే బ్యాంకింగ్ సేవలన్నీ పూర్తిగా నిలిచిపోతాయని అర్థం కాదు. సెలవు రోజుల్లో భౌతిక బ్యాంకు శాఖలు మాత్రమే మూసి ఉంటాయి. సాధారణంగా ఖాతాదారులు ఈ డిజిటల్ సేవలను ఉపయోగించుకోవచ్చు: ATM UPI ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ అయితే బ్యాంకు సర్వర్ మెయింటెనెన్స్ లేదా సాంకేతిక సమస్యల సమయంలో కొన్ని సేవలు తాత్కాలికంగా అందుబాటులో లేకపోవచ్చు

Original source: ntvtelugu.com
Read more on Kaizer News