Kaizer News

51 ఏళ్ల వయసులో 5 వికెట్లతో దూకుడు.. క్రికెట్ చరిత్

51 ఏళ్ల వయసులో 5 వికెట్లతో దూకుడు.. క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు.. ఎవరంటే?

· National - India · tv9telugu.com

Joanne Hicks Record: సాధారణంగా క్రికెట్లో 30 ఏళ్ల తర్వాత ఆటగాళ్లు కెరీర్ ముగింపు దశకు చేరుకుంటారు. అలాంటిది 47 ఏళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసి.. ఇప్పుడు 51 ఏళ్ల వయసులో ఏకంగా ఐదు వికెట్ల ఘనత సాధించారో క్రికెటర్. ఆమే ఐల్ ఆఫ్ మ్యాన్‌కు చెందిన ఆఫ్ స్పిన్నర్ జోఆన్ హిక్స్. గ్రీక్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌తో చరిత్ర సృష్టించారు. రోమేనియాలోని మొఆరా వ్లాసీ క్రికెట్ గ్రౌండ్‌లో ఐల్ ఆఫ్ మ్యాన్, గ్రీక్ మహిళల జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో జోఆన్ హిక్స్ తన స్పిన్ మాయాజాలంతో గ్రీక్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. నాలుగు ఓవర్లు వేసిన హిక్స్.. కేవలం 10 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టారు. ఇది ఆమె టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో మూడో ఐదు వికెట్ల ప్రదర్శన. అంతేకాదు.. ఆమె కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కూడా ఇవే. హిక్స్ ధాటికి గ్రీక్ జట్టు 15 ఓవర్లలో కేవలం 52 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఐల్ ఆఫ్ మ్యాన్ 6 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ప్రదర్శనతో జోఆన్ హిక్స్ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. 51 ఏళ్ల 173 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి బౌలర్‌గా నిలిచారు. ఇందులో పురుషులు, మహిళలు అనే తేడా లేదు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బర్ట్ ఐరన్‌మోంగర్ పేరిట ఉంది. 1932లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఆయన 49 ఏళ్ల 314 రోజుల వయసులో ఐదు వికెట్లు తీశారు. దాదాపు 94 ఏళ్లుగా కొనసాగుతున్న ఆ రికార్డును ఇప్పుడు హిక్స్ అధిగమించారు. జోఆన్ హిక్స్ క్రికెట్ ప్రయాణం కూడా చాలా ప్రత్యేకమైనదే. ఆమె 47 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. సాధారణంగా ఆ వయసులో ఆటగాళ్లు కెరీర్ ముగింపు దశలో ఉంటారు. కానీ హిక్స్ మాత్రం ఆ వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో ఆడటం ప్రారంభించారు. 2024లో 49 ఏళ్ల వయసులోనే ఆమె ఐదు వికెట్ల ఘనత సాధించారు. గ్రీక్, మాల్టా జట్లపై కొద్ది రోజుల వ్యవధిలోనే అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. అప్పట్లో మహిళల అంతర్జాతీయ క్రికెట్లో ఐదు వికెట్లు తీసిన అత్యంత పెద్ద వయస్కురాలిగా రికార్డు నెలకొల్పారు. హిక్స్ తాజా ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వయసులో ఐదు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నారు. 51 ఏళ్ల 173 రోజులు – జోఆన్ హిక్స్, ఐల్ ఆఫ్ మ్యాన్ vs గ్రీక్, మహిళల టీ20, 2026 49 ఏళ్ల 314 రోజులు – బర్ట్ ఐరన్‌మోంగర్, ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, టెస్టు, 1932 49 ఏళ్ల 234 రోజులు – బర్ట్ ఐరన్‌మోంగర్, ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, టెస్టు, 1931 49 ఏళ్ల 168 రోజులు – జోఆన్ హిక్స్, ఐల్ ఆఫ్ మ్యాన్ vs గ్రీక్, మహిళల టీ20, 2024 జోఆన్ హిక్స్ కథ కేవలం ఓ క్రికెట్ రికార్డు మాత్రమే కాదు. అంతర్జాతీయ స్థాయిలోకి ఆలస్యంగా వచ్చినా.. తన ఆటతీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవచ్చని ఆమె నిరూపించారు. 51 ఏళ్ల వయసులోనూ నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసి కేవలం 10 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. ముఖ్యంగా టీ20 క్రికెట్లో బ్యాటర్ల దూకుడును అడ్డుకోవడం అంత సులభం కాదు. అలాం

Original source: tv9telugu.com
Read more on Kaizer News