Kaizer News

Womens Asia Cup 2026: వరుస ఓటములకు చెక్ పెట్టేందుక

Womens Asia Cup 2026: వరుస ఓటములకు చెక్ పెట్టేందుకు హర్మన్‌ప్రీత్ సేన సిద్ధం.. థాయిలాండ్‌తో పోరుతో ఆసియా కప్‌లో ఇండియా జ‌ర్నీ షురూ..

· National - India · telugu.abplive.com

మహిళల టీ20 ఆసియా కప్ 2026 టోర్నమెంట్‌లో మోస్ట్ స‌క్సెస్ ఫుల్ టీమ్ ఇండియా తమ తొలి సమరానికి రెడీ అయింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే గ్రూప్ ఏ మ్యాచ్‌లో థాయిలాండ్‌తో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన తలపడనుంది. గత దశాబ్ద కాలంలో ఐదు ఎడిషన్లలో మూడుసార్లు టైటిల్ గెలిచి ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా భారత్‌ తిరుగులేని రికార్డు న‌మోదు చేసింది. అయితే ఇటీవల భారత జట్టు ప్రదర్శన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఆడిన 16 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఇండియా ఏకంగా 9 మ్యాచ్‌ల్లో ఓడింది. మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి గ్రూప్ దశలోనే నిష్క్రమించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫామ్‌పై ప్రశ్నలు వస్తున్న వేళ, వరుసగా ఆసియా కప్, ఆ తర్వాత జపాన్‌లో జరిగే ఏషియన్ గేమ్స్ రూపంలో భారత్‌కు అత్యంత కీలకమైన సవాళ్లు ఎదుర‌వ‌నున్నాయి. ఆ లోపాన్ని స‌వ‌రించుకోవాలి.. టాప్ ఆర్డర్‌లో స్మృతి మంధాన, షఫాలీ వర్మ వంటి విధ్వంసకర ఓపెనర్లు ఉన్నప్పటికీ, నంబర్ 3 ఆ తర్వాత వచ్చే బ్యాటర్లు వేగాన్ని కొనసాగించడంలో తంటాలు ప‌డుతున్నారు. స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ గాయం కారణంగా ఆసియా కప్, ఏషియన్ గేమ్స్ టోర్నీలకు దూరమవడంతో ఆమె స్థానంలో ప్రతీకా రావల్‌ను జట్టులోకి ఎంపిక చేశారు. అయితే మిడిల్ ఆర్డర్‌లో భారీ షాట్లు కొట్టే హిట్ట‌ర్ల‌ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. గత వరల్డ్ కప్ మ్యాచ్‌లలో బౌండరీ లైన్ వద్ద సులువైన క్యాచ్‌లను జారవిడవడం భారత్ ను ముంచింది. దీంతో ఈసారి ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దుకోవడంపై జట్టు మేనేజ్‌మెంట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. అనుభ‌వ‌జ్ఞుల అండ‌తో... భారత స్పిన్ విభాగానికి అనుభవజ్ఞురాలైన ఆల్‌రౌండర్ దీప్తి శర్మ నాయకత్వం వహిస్తుండగా, వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన శ్రీ చరణి, రాధా యాదవ్, ప్రేమ రావత్ ఆమెకు తోడుగా నిల‌వ‌నున్నారు. పేస్ విభాగంలో స్టార్ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్ ప్రధాన పాత్ర పోషించనుండగా, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, నందిని శర్మ బౌలింగ్ భారాన్ని మోస్తున్నారు. దుబాయ్ పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా భారత బౌలర్లు పూర్తి సిద్ధ‌మై ఉన్నారు. అంత ఈజీ కాదు.. మరోవైపు థాయిలాండ్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించి మంచి జోరుమీదుంది. మొదట బ్యాటింగ్ చేసి 120/9 స్కోరుకే పరిమితమైనప్పటికీ, కెప్టెన్ నరుఎమోల్ చైవాయ్ (43) బ్యాటింగ్‌లో రాణించగా, ఒన్నిచా కాంచోంపు (3/27), ఫన్నిత మాయ (2/22) బౌలింగ్‌లో కట్టుదిట్టంగా రాణించి హాంకాంగ్‌ను 114 పరుగులకే కట్టడి చేశారు. బలమైన భారత జట్టును ఎదుర్కొనేందుకు థాయిలాండ్ కూడా కఠిన సాధన చేస్తోంది. సో చిన్న జ‌ట్ట‌ని తేలిగ్గా తీసుకోకూడ‌ద‌ని విశ్లేషకులు పేర్కొంటున్నారు. (IST) Tags : Harmanpreet Kaur Renuka Singh Smriti Mandhana Womens Asia Cup Deepti Sharma IND VS THAI Breaking News, Anytime, Anywhere - Download ABPLIVE on Android and iOS now! Khelo khul ke, sab bhool ke - only on Games Live --> Advertisement టాప్ హెడ్ లైన్స్ క్రికెట్ వరుస ఓటములకు చెక్ పెట్టేందుకు హర్మన్‌ప్రీత్ సేన సిద్ధం.. థాయిలాండ్‌తో

Original source: telugu.abplive.com
Read more on Kaizer News