ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే? మార్చి 2027 నుంచి IST తప్పనిసరి దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్ Follow Us : --> Add as a preferred source on google IST Mandatory From March 2027: భారతదేశంలో సమయ వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి 2027 నుంచి దేశంలోని అన్ని సంస్థలు చట్టపరమైన, వాణిజ్య, డిజిటల్, పరిపాలనా అవసరాల కోసం భారత ప్రామాణిక సమయం (Indian Standard Time – IST)ను తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం లీగల్ మెట్రాలజీ (ఇండియన్ స్టాండర్డ్ టైమ్) రూల్స్, 2026ను ప్రకటించింది. లీగల్ మెట్రాలజీ రూల్స్ కింద ఈ నిబంధనలను తీసుకొచ్చారు. గెజిట్‌లో నోటిఫికేషన్ ప్రచురించిన 180 రోజుల తర్వాత ఇవి అమల్లోకి వస్తాయి. దీంతో సుమారుగా మార్చి 2027 నుంచి IST వినియోగం తప్పనిసరి కానుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలపై సంబంధిత చట్టం ప్రకారం జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం ప్రత్యేకంగా మినహాయింపు పొందిన సందర్భాలు మినహా.. దేశంలోని అన్ని చట్టపరమైన, పరిపాలనా, అధికారిక పత్రాలు, రికార్డులు భారత ప్రామాణిక సమయాన్ని ఆధారంగా చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాణిజ్యం, రవాణా, ప్రభుత్వ పరిపాలన, చట్టపరమైన ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీల్లో కూడా ISTను ప్రామాణిక సమయ సూచనగా ఉపయోగించాల్సి ఉంటుంది. అధికారిక అవసరాల కోసం ISTకు బదులుగా ఇతర సమయ సూచనను ఉపయోగించడం, ప్రదర్శించడం లేదా నమోదు చేయడాన్ని నిబంధనలు నిషేధిస్తున్నాయి. అయితే అన్ని సందర్భాల్లోనూ IST మాత్రమే ఉపయోగించాలనే నిబంధనకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఉదాహరణకు ఫారిన్ టైమ్ జోన్ ని (Time Zone) స్పష్టంగా సూచించాల్సిన సందర్భాలు, శాస్త్రీయ పరిశోధనలు, నావిగేషన్‌కు సంబంధించిన అవసరాలు, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన కార్యకలాపాలు, ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతించిన ఇతర సందర్భాలు, ఇలాంటి సందర్భాల్లో ఇతర సమయ వనరులను ఉపయోగించేందుకు అనుమతి ఉండవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ వ్యవస్థలు అత్యంత ఖచ్చితమైన సమయ సమకాలీకరణపై ఆధారపడుతున్నాయి. కొన్ని కీలక రంగాల్లో మైక్రోసెకండ్ స్థాయి సమయ ఖచ్చితత్వం కూడా అవసరమవుతోంది. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, టెలికాం నెట్‌వర్క్‌లు, 5G సేవలు, డిజిటల్ నావిగేషన్, విద్యుత్ పవర్ గ్రిడ్‌లు డేటా సెంటర్లు వంటి కీలక మౌలిక సదుపాయాలు సమకాలీకరించిన గడియారాలపై ఆధారపడి పనిచేస్తున్నాయి. సమయాన్ని ఒకే ప్రమాణంతో నిర్వహించడం వల్ల లావాదేవీలను కచ్చితంగా నమోదు చేయడం, వివిధ వ్యవస్థల మధ్య సమన్వయం పెంచడం, నెట్‌వర్క్‌ల విశ్వసనీయతను మెరుగుపరచడం సాధ్యమవుతుంది. కొత్త నిబంధనల్లో సైబర్ రెసిలియన్స్‌కు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. అంటే సైబర్ దాడులు జరిగినప్పుడు వాటిని తట్టుకుని, సాధ్యమైనంత త్వరగా వ్యవస్థలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురాగల సామర్థ్యాన్ని పెంచడం. సంస్థలు తమ సమయ-సమకాలీకరణ వ్యవస్థలను సురక్షితంగా నిర్వహించాల్సి ఉంటుంది. టైమ్ సింక్రనైజేషన్ వ్యవస్థలను సక్రమంగా అమలు చేయాలి. స్పూఫిం