Kaizer News

LB Nagar: రూ. 1.44 కోట్లతో సీసీ రోడ్డు పనులకు శంకు

LB Nagar: రూ. 1.44 కోట్లతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మధుయాష్కి గౌడ్

· City - Hyderabad · hmtvlive.com

ఎల్బీనగర్: సీఎం రేవంత్ రెడ్డి గారు ఎల్బీనగర్ నియోజకవర్గానికి అత్యధిక నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి పనులకు ప్రత్యేక సహకారం అందిస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు పేర్కొన్నారు. చంపాపేట డివిజన్లోని మారుతీ నగర్ కాలనీలో లో రూ. 1.44 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి గారు, సేవ దళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ గార్లతో కలిసి మధుయాష్కి గౌడ్ గారు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మధుయాష్కి గారు మాట్లాడుతూ.. అభివృద్ధి కోసమని పార్టీ మారిన ఇక్కడి ఎమ్మెల్యే, ఏ అభివృద్ధి చేయకుండా ప్రజలను మోసం చేశాడని, సూర్యుడి కంటే ముందే లేస్తా అని డైలాగులు మాత్రమే చెప్పుకుంటున్నాడని విమర్శించారు. మూసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి పొందాడే తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. రాజకీయాలకతీతంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే నియోజకవర్గానికి నిధులు మంజూరయ్యాయని బిజెపి మాజీ కార్పొరేటర్లు సైతం పలు వేదికలపై మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు స్పందించి పనిచేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం ప్రజలు కట్టిన పన్నులను కాళేశ్వరానికి తరలించి కమీషన్లు దండుకొని తిన్నారని, సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం నగరంలో వసూలు చేసే పన్నులను ఇక్కడి అభివృద్ధి కే ఖర్చు చేస్తున్నారన్నారు. నగరంలో మౌలిక వసతులైన రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు కల్పించేలా కృషి చేస్తున్నామన్నారు. చంపాపేట డివిజన్లో గతంలో వరద ముంపు సమస్యలు ఉంటే, తాము రూ. 5కోట్ల నిధులతో పనులు చేయించి సమస్య తీర్చామన్నారు. డ్రైనేజీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఎంపీగా ఈటల రాజేందర్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు..? అని ప్రశ్నించారు. ఇక్కడి ఎమ్మెల్యే 118 జీవో ద్వారా కన్వీనెంట్ డేట్ తీసుకొచ్చి ప్రజలకు బురిడీ కొట్టించాడన్నారు . మునుగోడు ఉప ఎన్నికను పురస్కరించుకొని హడావుడిగా 118 జీఓ తీసుకొచ్చి.. ప్రజలు కష్టపడి కొనుక్కున్న ఇళ్లలో ప్రజలే కబ్జాదారులని కన్వీనియన్స్ డీడ్ లలో చూపించారని, ప్రజలతో పైసలు కట్టించి కన్వీనియన్స్ డీడ్ పేరిట చిత్తుకాగితాన్ని అందజేశారని విమర్శించారు. SIR ఫేజ్ -2లో ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని.. 1,87,000 ఓట్లు నో మ్యాపింగ్ లో ఉన్నాయని, నోటీసులు అందుకునే అందరూ సరైన వివరాలు అందించి ఓట్లు నమోదు చేసుకోగలరని సూచించారు. మల్రెడ్డి రాంరెడ్డి గారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత మధుయాష్కి గౌడ్ గారి సహకారంతో వివిధ నియోజకవర్గంలో రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఎల్బీనగర్ అంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక అభిమానమన్నారు. గత ప్రభుత్వంలో 100 కోట్ల నిధులు కూడా నియోజకవర్గానికి రాలేదని.. అభివృద్ధి పేరిట ఇక్కడి ఎమ్మెల్యే డ్రామాలు ఆడుతుంటాడని విమర్శించారు. మేము మంత్రిగారికి రోడ్లు, అభివృద్ధి విషయాలు చెప్పగానే.. ఎమ్మెల్యే వాటిపై మాట్లాడుతూ. తానే చేస్తున్నట్లు డ్రామాలు చేస్తుంటారని విమర్శించారు. ఈ సందర్భ

Original source: hmtvlive.com
Read more on Kaizer News