Kaizer News

B Vinod Kumar | NEET-PG ఆల్ ఇండియా కోటాను 50 శాతం

B Vinod Kumar | NEET-PG ఆల్ ఇండియా కోటాను 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలి : బోయినపల్లి వినోద్ కుమార్

· City - Hyderabad · ntnews.com

B Vinod Kumar | నీట్-పీజీ ఆల్ ఇండియా కోటాను 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఈ రోజు (ఆదివారం) దేశవ్యాప్తంగా నిర్వహించిన NEET-PG పరీక్ష సందర్భంగా తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థులు, డాక్టర్ల నుంచి అందిన సమాచారం, వారి ఆందోళనల నేపథ్యంలో, NEET-PGలో ప్రస్తుతం ఉన్న 50 శాతం ఆల్ ఇండియా కోటా (AIQ)ను 15 శాతానికి తగ్గించాలని వినోద్ కుమార్ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం జిల్లాల వారీగా అనేక కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసి, వైద్య విద్యతోపాటు పీజీ సీట్లను గణనీయంగా పెంచిందని ఆయన తెలిపారు. ఈ సీట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రజల నిధులు, ప్రభుత్వ వనరులు వినియోగించబడుతున్నందున, వాటిలో అధిక భాగం తెలంగాణ వైద్య విద్యార్థులకు అందుబాటులో ఉండేలా విధానం ఉండాలని కోరారు. NEET-UGలో 15 శాతం AIQ అమలులో ఉండగా.. NEET-PGలో 50 శాతం AIQ ఉండటం సమతుల్యంగా లేదని పేర్కొంటూ, PGలో కూడా AIQను 15 శాతానికి తగ్గించాలని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే ప్రతి రాష్ట్రం నుంచి AIQకు ఎన్ని ప్రభుత్వ PG సీట్లు వెళ్తున్నాయి.. ఇతర రాష్ట్రాల నుంచి ఎంతమంది విద్యార్థులు సీట్లు పొందుతున్నారు.. అనే అంశాలపై రాష్ట్రాల వారీగా పారదర్శకమైన గణాంకాలను విడుదల చేసి ప్రస్తుత AIQ విధానంపై సమగ్ర సమీక్ష చేయాలని వినోద్ కుమార్ కోరారు. ఈ డిమాండ్ తెలంగాణకు మాత్రమే పరిమితం కాదని, రాష్ట్రాలు తమ ప్రజా నిధులతో అభివృద్ధి చేస్తున్న వైద్య విద్యా మౌలిక వసతులకు అనుగుణంగా పీజీ సీట్లలో సముచిత వాటా రాష్ట్ర విద్యార్థులకు లభించేలా సమతుల్యమైన సమాఖ్య విధానం అవసరమని ఆయన పేర్కొన్నారు. Switzerland | స్విట్జర్లాండ్ రేవ్ పార్టీలో కాల్పులు.. ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు వైభవంగా మార్వాడీల కావడి యాత్ర.. హరిహర మహాదేవ’ నామస్మరణతో సాగిన భక్తుల పాదయాత్ర TVK vs Cong | కాబోయే ప్ర‌ధాని విజ‌య్ అంటూ జోరుగా ప్ర‌చారం.. అధికార కూటిమిలో క‌ల‌క‌లం..!

Original source: ntnews.com
Read more on Kaizer News