Shorts ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ గణనాథుని విగ్రహ నిమజ్జనం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. (S.H.O) మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది, జర్నలిస్టులు, భక్తులు మరియు ఇతరులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. గణనాథుని నిమజ్జనం సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, ప్రజలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జన వేడుకలను నిర్వహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం భక్తులు, సిబ్బంది మరియు స్థానికుల భాగస్వామ్యంతో సందడిగా సాగింది