మహాగణపతి నిమజ్జనం తేదీ ఖరారు.. సెప్టెంబర్ 25న హుస్సేన్ సాగర్‌లో గణనాథుడి నిమజ్జనం Khairatabad | హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన తేదీ ఖరారైంది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న శుక్రవారం రోజున గణనాథుడిని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. అనంత చతుర్దశి పర్వదినం సెప్టెంబర్ 25న రావడంతో అదే రోజు నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి “శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి” రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ప్రతి సంవత్సరం 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలు ఈసారి 12 రోజుల పాటు కొనసాగనున్నాయి.దీంతో భక్తులకు స్వామివారి దర్శనానికి అదనపు సమయం లభించనుంది. నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం నేపథ్యంలో నగరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. నిమజ్జనం తేదీ ఖరారు కావడంతో భక్తుల్లో ఉత్సాహం నెలకొంది