Shorts LB Nagar: GO 118 బాధితుల దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో GO 118 పరిధిలోని బాధితులకు సేల్ డీడ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, మైనారిటీ సంక్షేమ మంత్రి అజారుద్దీన్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎల్‌బీనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి మధుయాష్కీ గౌడ్‌తో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. GO 118 పరిధిలోని 44 కాలనీలకు చెందిన బాధితులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి తరలివచ్చారు. తమ ఇళ్లకు సంబంధించి హక్కులు కల్పించే ప్రక్రియలో భాగంగా సేల్ డీడ్లను అందుకున్నారు. మిగిలిన సమస్యలపైనా సుధీర్‌రెడ్డి ఫోకస్ ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి 44 కాలనీల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కన్వేయన్స్ డీడ్లతో పాటు సేల్ డీడ్లు ఇవ్వడం సంతోషకరమన్నారు. అయితే అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమస్య ఇంకా పరిష్కారం కాలేదని అన్నారు. సెక్షన్ 378/2019 కింద ఉన్న రిజిస్ట్రేషన్ ఆంక్షలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. గతంలో జారీ చేసిన జీవోను రద్దు చేయాలని లేదా సవరించాలని రెవెన్యూ మంత్రిని విజ్ఞప్తి చేశారు. మేడ్చల్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లోని GO 118 సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. ఎల్‌బీనగర్ పారిశ్రామిక ప్రాంతంలోని మరో 22 కాలనీలను కూడా GO 118 పరిధి నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. “ఆలస్యమైనా న్యాయమే గెలిచింది” అంటూ సుధీర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చొరవతో GO 118 సమస్యకు పరిష్కారం లభించిందని మధుయాష్కీ గౌడ్ తెలిపారు. 30 ఏళ్లకు పైగా 44 కాలనీల్లో నివసిస్తున్న బాధితులకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి యాజమాన్య హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కన్వీయన్స్ డీడ్‌కు బదులుగా సేల్ డీడ్ ద్వారా పూర్తి హక్కులు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పొంగులేటి హామీ.. రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఆస్తులు సమకూర్చుకున్న పేద, మధ్యతరగతి కుటుంబాల సమస్యను ప్రభుత్వం గుర్తించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పేదల సంక్షేమం, అభివృద్ధితో పాటు హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు. భవిష్యత్‌లో రెవెన్యూ సమస్యలు లేకుండా శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూమికి, మనిషికి తెగిపోని పేగు బంధం లాంటి సంబంధం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భూముల విలువలు పెరుగుతున్న కొద్దీ భూ వివాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. భూ ఆధారాలు, సర్వేలకు సంబంధించిన సమస్యలను గుర్తించి శాశ్వతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా ఏర్పడుతున్న కాలనీలకు ప్రజా రవాణా సౌకర్యం కల్పించేందుకు కాలనీల వారీగా కొత్త బస్సులు ఏర్పాటు