Kaizer News

Kaagitham Padavalu Review : ‘కాగితం పడవలు’ రివ్యూ.

Kaagitham Padavalu Review : ‘కాగితం పడవలు’ రివ్యూ.. చిన్నప్పటి నుంచి ప్రేమ పెద్దయ్యాక ఏమైంది?

· Entertainment · 10tv.in

వర్ధన్, కృష్ణప్రియ జంటగా తెరకెక్కిన సినిమా ‘కాగితం పడవలు’. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, T. R. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మాణంలో ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కాగితం పడవలు సినిమా నేడు సెప్టెంబర్ 18న థియేటర్స్ లో రిలీజ్ అయింది. రాము(వర్ధన్) స్కూల్ లో ఉన్నప్పటి నుంచి పక్కూరికి చెందిన గోదావరి(కృష్ణప్రియ)ని ప్రేమిస్తాడు. గోదావరి కూడా మొదట ప్రేమించినా ఓ సంఘటనతో అపార్థం చేసుకొని రాముని దూరంగా పెడుతుంది. అయినా రాము కాలేజీ ఏజ్ కి వచ్చినా ఆమె వెనకే పడుతూ ఉంటాడు. ఓ సంఘటనతో మళ్ళీ గోదావరి – రాము ప్రేమించుకుంటారు. రామ్ ఫ్రెండ్ రాజేష్(MGR తుకారాం), గోదావరి ఫ్రెండ్ స్వప్న కూడా ప్రేమించుకుంటారు. రెండు ప్రేమ జంటలు, ఫ్రెండ్స్, కాలేజి లైఫ్ తో హ్యాపీగా సాగిపోతున్న సమయంలో రాజేష్ – స్వప్నల ప్రేమ ఇంట్లో తెలిసి కులం వేరని రెండు ఊళ్ళ పంచాయితీలు వీళ్లకు దారుణమైన శిక్షలు వేస్తాయి. ఆ ఘటన తర్వాత రాజేష్ – స్వప్న ఇద్దరూ ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. దీంతో రాము – గోదావరిలు ఇంట్లో తమ ప్రేమని ఒప్పుకోరని భయపడి లేచిపోవడానికి ప్లాన్ చేస్తారు. మరి రాము – గోదావరిలు లేచిపోతారా? వీళ్ళ ప్రేమ ఇద్దరి ఇళ్లల్లో తెలిస్తే ఏం జరుగుతుంది.. తెలియాలంటే తెరపై చూడాల్సిందే.. . దేశభక్తుడిని ఉగ్రవాది అంటే ఏం చేసాడు..? రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన సినిమా అని ప్రమోట్ చేయడం, పాటలు బాగుండటం, విశ్వక్సేన్ సినిమా ప్రమోషన్స్ కి రావడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఫస్ట్ హాఫ్ హీరో – హీరోయిన్ లు చిన్నప్పటి నుంచి ప్రేమ సీన్స్, ఫ్రెండ్స్ సీన్స్ తో బాగా సాగదీశారు. చిన్నప్పటి స్కూల్ ఏజ్ కథ అంత సాగదీయాల్సిన అవసరం లేదు. ఒక పాట, చాలా సీన్స్ ఎడిటింగ్ లో తీసేయొచ్చు. ఆ తర్వాత కాలేజీలో లవ్ సీన్స్, హీరో హీరోయిన్స్ మధ్య కొన్ని క్యూట్ సీన్స్, కొన్ని కామెడీ సీన్స్ తో నడిపించారు. రాజేష్ – స్వప్న ప్రేమ ఇంట్లో వాళ్లకు తెలిసాక కులం వేరని పెద్దలు చేసే అరాచకాలతో బోలెడన్ని పాత సినిమాలు గుర్తుచేశారు. ఇక ఇంటర్వెల్ కి రాజేష్ – స్వప్న చనిపోవడంతో రాము – గోదావరి ఏం చేస్తారు అని సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా రాము – గోదావరి ప్రేమ కథ, ఇంట్లో వాళ్లకు తెలియడం, లేచిపోవడానికి ప్లాన్ చేసుకోవడంతో ఆసక్తిగా సాగుతుంది. క్లైమాక్స్ లో కులం మీద ఓ నాలుగు డైలాగ్స్ వేసి ముగించారు. సినిమా ఓపెనింగ్ స్కూల్ పిల్లలతో ఒక వరస్ట్ సీన్ తో మొదలు పెట్టారు. అసలు అలాంటి సీన్ పెట్టాలనే ఆలోచన డైరెక్టర్ కి ఎలా వచ్చిందో. చిన్నప్పటి సీన్స్ అన్ని బాగా సాగదీశారు. లవ్ సీన్స్ మాత్రం క్యూట్ గా రాసుకున్నారు. అన్ని లవ్ సీన్స్ బాగున్నాయి. రెండు ప్రేమ జంటలకు లవ్ సీన్స్ బాగానే రాసుకున్నారు. ఇంటర్వెల్ ఎమోషన్ బాగానే వర్కౌట్ అయింది. కానీ మిగిలిన ఎమోషన్ సీన్స్ పండలేదు. హీరోయిన్ హీరోని అపార్థం చేసుకునే విషయం ముందే ఊహించేయొచ్చు. క్లైమాక్స్, క్లైమాక్స్ లో ఇచ్చే ఒక ట్విస్ట్ రెండూ ఊహిస్తాము. మధ్యలో వచ్చిన జర్నలిస్ట్ పాత్ర ని మధ్యలోనే ముగించేశారు. అసలు ఆ పాత్ర ఎం

Original source: 10tv.in
Read more on Kaizer News