Kaizer News

Amanagal: వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వాలి: గంప

Amanagal: వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వాలి: గంప వెంకటేష్ గుప్తా!

· City - Hyderabad · hmtvlive.com

Shorts ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం రైతన్నలకు వ్యవసాయానికి 24 గంటల కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసి ఆదుకోవాలని ఆమనగల్లు సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా అన్నారు. శనివారం అమంగల్ మండల పరిషత్ సమావేశ హాలులో మండల సర్వసభ్య సమావేశం ప్రత్యేక అధికారి శోభ రాణి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతన్నలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందించిందని ప్రస్తుత ప్రభుత్వంలో విద్యుత్ సరఫరా కోతలు కారణంగా పాడి రైతులు వ్యవసాయ సాగు చేసే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మండలంలోని పోలేపల్లి, సింగంపల్లి గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామాల సర్పంచులు సత్యం, వెంకటయ్య మండల సభ దృష్టికి తెచ్చారు. ఆర్టీసీ మేనేజర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీకి సంబంధించి తనకు వినతి పత్రం అందజేస్తే సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తానని అన్నారు. చింతలపల్లి గ్రామంలో త్రాగునీటి సమస్య ఉందని ఓ ట్యాంకు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ యాదయ్య సభ దృష్టికి తీసుకువచ్చారు' అదేవిధంగా మండలంలో పశు వైద్య అధికారులు సిబ్బంది గ్రామాలకు వస్తే ఆయా సర్పంచ్ లు సమాచారం ఇవ్వాలని పలు సర్పంచులు కోరారు. పశు వైద్యం కోసం వేరే వ్యక్తులు వచ్చి ఇక్కడ వైద్యం చేస్తున్నారని వారిని నివారించేందుకు పశువైద్యాధికారి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా పామాయిల్ సాగుపై మండలంలోని రైతులకు అవగాహన కల్పించాలని దానిపై వచ్చే సబ్సిడీ వివరాలు గ్రామాలలో ప్రచారం నిర్వహించి రైతులను చైతన్యం చేయాలని అన్నారు. ఆమనగల్ మండలంలో రేషన్ డీలర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చనిపోయిన వ్యక్తులకు కూడా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని రేషన్ కార్డు నుంచి వారి పేరును తొలగించాలని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్న వారు పట్టించుకోవడంలేదని పలు గ్రామాలకు చెందిన సర్పంచ్లు ఆరోపించారు. వెంటనే ఆమనగల్ సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా మాట్లాడుతూ స్పందించని అధికారులపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి చనిపోయిన వ్యక్తుల పేర్లను రేషన్ కార్డులో వచ్చి తొలగించాలని సంబంధిత అధికారులను కోరారు. కొత్త కుంట తండాలో రేషన్ షాపులు ఏర్పాటు చేయాలని సర్పంచ్ పత్య నాయక్ సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆమనగల్లు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండలంలోని 13 గ్రామ పంచాయతీలలో విలేజ్ పోలీసింగ్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఏ సమస్య వచ్చినా వారి దృష్టికి తీసుకురావాలని కోరారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి డీజేలు వాడకుండా భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేసుకోవాలని ఇన్స్పెక్టర్ ప్రజాప్రతినిధులకు గ్రామస్తులకు సూచించారు ఎలాంటి ఇబ్బందులు కలిగిన పోలీస్ శాఖ సహకారానికి ముందుంటుందని ఇన్స్పెక్టర్ తెలిపారు. విద్యుత్ శాఖ పై సమీక్ష జరుగుతుండగా ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్ కు వచ్చినప్పుడు ఉచితంగా సర్వీస్ చేయకుండా మూడు నుంచి ఐదు వేల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వెంటనే అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కరెంట్ అధికారులకు గం

Original source: hmtvlive.com
Read more on Kaizer News