Tirupati | భారీ వర్షంతో.. విరిగిన కరెంటు పోల్స్ చురుగ్గా కరెంట్ అధికారులు ఏర్పాట్లు విరిగిన చెట్లు.. తొలగించే ఏర్పాట్లు నిమగ్నమైన విద్యుత్ శాఖ అధికారులు Tirupati | తిరుపతి సిటీ, సెప్టెంబర్ 20 (ఆంధ్రప్రభ): స్థానిక వరదరాజు నగర్ లో శనివారం రాత్రి కురిసిన వర్షానికి ఆ ప్రాంతంలో కరెంటు పోల్స్ విరిగిపోవడంతో పాటు ఆ ప్రాంతంలో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. వినియోగదారులు విద్యుత్ అధికారులకు తెలియజేయడంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలుపుదల చేయడం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ఆ ప్రాంతంలో విద్యుత్ నిలుపుదల చేయడంతో ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరోపక్క భవనాలపై చెట్లు విరిగి వాలడంతో విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ఆ ప్రాంతంలో ఆదివారం ఏర్పాటు చురుగ్గా చేపడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో విరిగిపోయినటువంటి చెట్లను తొలగించడంతో పాటు విరిగిపోయిన కరెంటు పోల్స్ దగ్గర ఆపోల్స్ ను తొలగించి వేరే పోల్స్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సమస్యకు అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు విద్యుత్ సమస్యను ఉత్పన్నం కాకుండా చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టడంతో పాటు పనులు వేగవంతం చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఆ ప్రాంతంలో విద్యాసంస్థలతో పాటు వ్యాపార కేంద్రాలు కూడా ఉండటంతో విద్యుత్ శాఖ అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ విద్యుత్ శాఖ ఏ.ఈ. ఉమాపతి మాట్లాడుతూ… ఏదైనా విద్యుత్ సమస్య ఉత్పన్నమైతే వెంటనే తన ఫోన్ నెంబర్ కు కానీ లేదా విద్యుత్ శాఖ ఫోన్ నెంబర్ ను కానీ సంప్రదించాలని కోరారు. వినియోగదారులకు ఎటువంటి విద్యుత్ సమస్య రాకుండా ఏర్పాట్లు చురుగ్గా చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు