Kaizer News

నేపాల్‌ వరదల్లో హైదరాబాదీ గల్లంతు

నేపాల్‌ వరదల్లో హైదరాబాదీ గల్లంతు

· City - Hyderabad · ntnews.com

మానససరోవర్‌ వెళ్లివస్తూ అదృశ్యమైన మహిళ శ్రీదేవి వేజెళ్లగా గుర్తింపు హైదరాబాద్‌, ఆగస్టు 30, (నమస్తే తెలంగాణ)ః నేపాల్‌ వరదల్లో హైదరాబాద్‌కు చెందిన శ్రీదేవి వేజెళ్ల గల్లంతైందని ఆమె భర్త దీపక్‌ తెలిపారు. కైలాస మానస సరోవర యాత్ర ముగించుకుని, తిరుగు ప్రయాణంలో ఉన్న తన భార్య వరదల్లో చిక్కుకుందని ఆయన అదివారం మీడియాకు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో శ్రీదేవి ఇమ్మిగ్రేషన్‌ భవనం లోపలే ఉన్నారని, వరదలకు ఆ భవనం పూర్తిగా ధ్వంసమైందన్నారు. భారీ యం త్రాలతో ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని దీపక్‌ తెలిపారు

Original source: ntnews.com
Read more on Kaizer News