ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో విద్యుత్ అమరవీరులకు విప్లవ, వామపక్ష పార్టీల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్‌లో 2000 సంవత్సరంలో జరిగిన కాల్పుల ఘటనలో మృతి చెందిన విద్యుత్ అమరవీరులు రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌లను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆలేరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్. జనార్దన్, సీపీఐ జిల్లా కమిటీ సభ్యుడు చెక్క వెంకటేష్, సీపీఎం సీనియర్ నాయకుడు మొరిగాడి చంద్రశేఖర్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు కల్లెపు అడివయ్య, సీపీఎం నాయకుడు వడ్డేమాన్ బాలరాజు, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పద్మ సుదర్శన్, ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మామిడాల బాలమల్లేష్, అరుణోదయ జిల్లా నాయకుడు ఇక్కిరి శ్రీనివాస్, సీపీఎం మండల నాయకులు గణగాని మల్లేష్, ఖలీల్, ఎం.డీ. మతీన్, సీపీఐ మండల నాయకుడు గిరబోయిన స్వామి, ప్రజా సంఘాల నాయకులు కుర్రి సత్యనారాయణ, బుడిగె లక్ష్మయ్య, గుజ్జ పాండు, నమిలే అంజిబాబు తదితరులు పాల్గొన్నారు