Kaizer News

మేఘాలయలో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు హతం

మేఘాలయలో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు హతం

· National - India · sakshi.com

షిల్లాంగ్‌: మేఘాలయాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. తూర్పు గారోహిల్స్ జిల్లాలోని సోంగ్‌సాక్ సమీపంలో పోలీసులకు అంతర్రాష్ట్ర నేర ముఠాకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు నేరస్థులు హతమయ్యారు. ఈ వివరాలను పోలీసులు ప్రకటించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, సాంగ్సాక్ ప్రాంతంలో పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్న సమయం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సమయంలో అనుమానిత ముఠా సభ్యులు పోలీసులపై కాల్పులు జరపడంతో, సిబ్బంది ఎదురు కాల్పులు జరిపినట్లు సమాచారం. మృతుల వివరాలు.. మేఘాలయకు చెందిన అలచోన్ మారక్ , అగియాకు చెందిన కలం షేక్, కృష్ణాయికి చెందిన భాబిదుల్ ఇస్లాం ,సుస్తమ్ రభాగా అధికారులు గుర్తించారు. ఈ పోలీసు ఆపరేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

Original source: sakshi.com
Read more on Kaizer News