ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. ఉజ్బెకిస్థాన్‌లో పర్యటించడం మోదీకి ఇది నాలుగోసారి శనివారం ఉదయం ఆయన ఢిల్లీ నుంచి ఉజ్బెక్ కు బయలుదేరి వెళ్లారు. సాయంత్రానికి ఆ దేశ రాజధాని తాష్కెంట్ లో ల్యాండ్ అయ్యారు. తాష్కెంట్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్ స్వయంగా ఎయిర్ పోర్ట్ కు వచ్చి ప్రధాని మోదీకి స్వాగతం పలకడం హైలైట్. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక, ద్వైపాక్షిక బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి చేర్చడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ఆయన తాష్కెంట్ నగరం అంతా కూడా భారత జాతీయ జెండాలు, భారీ హోర్డింగ్‌లతో ముస్తాబైంది. విమానాశ్రయం నుంచి ప్రధాని మోదీ నేరుగా మిర్జియోయెవ్‌తో కలిసి యాంగి ఉజ్బెకిస్థాన్ పార్క్ ను సందర్శించారు. అక్కడ ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. తాష్కెంట్ లో నివసిస్తోన్న ప్రవాస భారతీయులు విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆయన బస చేసిన హోటల్ కూ భారీగా తరలి వచ్చారు. ఉజ్బెకిస్థాన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో ఇరు దేశాల అధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ప్రధానంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ విభాగాలు, డిజిటల్ కనెక్టివిటీ, అంతరిక్ష పరిశోధనలు, విద్యారంగాల్లో పరస్పర సహకారంపై చర్చించనున్నారు. ఏరికోరి అదృష్టాన్ని తీసుకొచ్చే ఇత్తడి తాబేలును ఎంచుకున్న ప్రధాని మోదీ ఈ ఉదయం తాష్కెంట్‌లో నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉజ్బెకిస్థాన్ యోగా ఫెడరేషన్ దీన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఆయన స్వయంగా పాల్గొన్నారు. స్థానిక యోగా ట్రైనర్లు, ఆ దేశానికి చెందిన క్రీడాకారులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థ కార్యనిర్వాహక అధికారులు, స్థానిక యువతీ యువకులు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు. యోగాసనాలు వేశారు. టీమిండియా లెజెండ్.. బెంగళూరు మెట్రో రైల్ లో ఓ సాదాసీదా ప్రయాణికుడిలా ఈ సందర్భంగా ప్రధాని మోదీ డిఫరెంట్ లుక్ లో కనిపించారు. టీ షర్ట్, ట్రాక్ ప్యాంట్ ధరించారు. ముదురు నీలం రంగు జిమ్ టీ షర్ట్, ట్రాక్ ప్యాంట్, దానికి తగ్గ షూస్ ధరించారు. సాధారణంగా అధికారిక పర్యటనల్లో సూట్ తో కనిపిస్తుంటారాయన. ఇది యోగా సెషన్ కావడం వల్ల క్యాజువల్ దుస్తులనే వేసుకున్నారు. యోగా సెషన్ లో కలియదిరిగారు. ఆసనాలను స్వయంగా తిలకించారు. వారికి కొన్ని చిట్కాలు చెప్పారు. యోగా విశిష్టత గురించి వివరించారు. నిత్య జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి, ప్రశాంతతను సాధించడానికి యోగా సాధన ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు