Kaizer News

ప్యారడైజ్ కాకుల వెనుక ఇంత కథ ఉందా? నెటిజన్ల కొత్త

ప్యారడైజ్ కాకుల వెనుక ఇంత కథ ఉందా? నెటిజన్ల కొత్త థియరీ..

· Entertainment · prabhanews.com

కడుపుమండిన కాకుల కథ’ అంటూ రా స్టేట్‌మెంట్‌.. ‘ఆయా షేర్‌’లో మిస్టీరియస్‌ బీజీఎం.. ధూమావతి దేవితో కనెక్షన్‌పై నెటిజన్ల డీకోడింగ్‌ హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ‘దసరా’తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్‌ ఒదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్‌’. ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రకటించినప్పటి నుంచే కాకులు, వాటి చుట్టూ ఉన్న విజువల్స్‌, ప్రచార కంటెంట్‌ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘ప్యారడైజ్‌’ ప్రమోషన్స్‌లో ఇప్పటికే ‘ ఆయా షేర్‌ ’ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాట యూట్యూబ్‌లో 244 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించి సోషల్‌ మీడియాలోనూ మంచి చర్చకు కారణమైంది. అయితే ఇప్పుడు అదే పాటలో వినిపించే ‘ధూం ధూం తఃతః’ అనే బీజీఎం కొత్త చర్చకు తెరలేపింది. ఈ ట్రాక్ విన్న కొందరు.. ఇది ‘ధూం ధూం ధూమావతి తఃతః’ అనే ఛాంటింగ్‌ను పోలి ఉందంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక సినిమాలో మొదటి నుంచీ కాకులకు ఇస్తున్న ప్రాధాన్యం.. అలాగే ఈ సినిమా నుంచి వ‌చ్చిన‌ రా స్టేట్‌మెంట్‌లోనూ కాకుల గురించే చెప్పడం.. దీనికి తోడు ‘ధూం ధూం తఃతః’ అనే బీజీఎం రావడంతో నెటిజన్లు ‘పీక్‌ డీటెయిలింగ్‌’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాకుల చుట్టూ కథను నడిపించే సినిమాలో.. ధూమావతి దేవి ఛాంటింగ్‌లోని లైన్‌ను ప్రధాన ట్రాక్‌లో భాగం చేయడం అద్భుతమైన ఆలోచన అంటూ దర్శకుడు శ్రీకాంత్‌ ఒదెలతో పాటు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పైనా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రా స్టేట్‌మెంట్‌లోని డైలాగ్స్ ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి. “చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాశిర్రు గానీ.. గదే జాతిల పుట్టిన కాకుల గురించి బైంగన్‌ బి రాయలే.. గిది కడుపుమండిన కాకుల కథ.. జమానా జమానాకెళ్లి నడిచిన శవాల కథ.. అమ్మ రొమ్ములో పాలు లేక రత్తం పోసి పెంచిన ఓ జాతి కథ..” ఈ డైలాగ్‌తో విడుదలైన ‘ప్యారడైజ్‌’ రా స్టేట్‌మెంట్‌ .. సినిమాలో కాకులకు ఉన్న ప్రాధాన్యంపై ఆసక్తిని మరింత పెంచింది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ.. ఈ డైలాగ్‌ను ‘ఆయా షేర్‌’ పాటలోని ‘ధూం ధూం తఃతః’ బీజీఎంతో లింక్‌ చేస్తూ నెటిజన్లు చేస్తున్న విశ్లేషణలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. కాకి.. ధూమావతి దేవి.. ‘ధూం ధూం తఃతః’.. ‘కడుపుమండిన కాకుల కథ’.. ఈ నాలుగు అంశాలను కలిపి నెటిజన్లు తమదైన రీతిలో డీకోడ్‌ చేస్తున్నారు. సినిమా టీమ్‌ అధికారికంగా చెప్పకముందే.. ప్రచార కంటెంట్‌లోని చిన్న చిన్న క్లూస్‌ను పట్టుకుని “పీక్‌ డీటెయిలింగ్‌” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘పారడైజ్‌’లో కాకులు.. ధూమావతి దేవి.. ఆ మిస్టీరియస్‌ బీజీఎం మధ్య ఉన్న కనెక్షన్‌ ఒక ఆసక్తికరమైన థియరీగానే సోష‌ల్ మీడియాలో బ‌జ్ క్రియేట్ చేస్తుంది. ధూమావతి దేవి హిందూ తాంత్రిక సంప్రదాయంలోని దశ మహావిద్యల్లో ఏడో దేవతగా పరిగణిస్తారు. ‘ధూమావతి’ అనే పేరు పొగతో కూడినది, పొగమయమైనది అనే అర్థాలను సూచిస్తుంది. హిందూ సంప్రదాయంలోని ఇతర దేవతలతో పోలిస్తే ధూమావతి దేవి రూపం చాలా భిన్నంగా ఉంటుంది. సాధారణంగా వృద్ధ వితంతువు రూపంలో, అలంకారాలు లేకుండా, చేతిలో చాటతో ఉన్నట్లుగా ఆమెను చిత్రిస్తార

Original source: prabhanews.com
Read more on Kaizer News