Ashwin: భారత క్రికెట్ చరిత్రలోని ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాళ్ల మధ్య పోటీ పెడితే విజేత ఎవరు? ఈ ఆసక్తికరమైన ప్రశ్నపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో స్పందించాడు. ESPNcricinfo కోసం నిర్వహించిన ఒక బ్రాకెట్ గేమ్‌లో, వేర్వేరు తరాలకు చెందిన భారత దిగ్గజాలను ఒకరితో ఒకరు పోలుస్తూ అశ్విన్ విశ్లేషించాడు. కొన్ని అనూహ్యమైన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న ఆయన, చివరికి బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను ‘గ్రేటెస్ట్ ఇండియన్ క్రికెటర్’గా ఎంచుకున్నాడు. ఈ పోటీలో అశ్విన్ తీసుకున్న అత్యంత సంచలన నిర్ణయం విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా మధ్య జరిగింది. టెస్టులతో పాటు అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన రికార్డు ఉన్న కోహ్లీని కాదని బుమ్రాను ఎంపిక చేయడానికి అశ్విన్ తీవ్రంగా ఆలోచించాల్సి వచ్చింది. బౌలర్‌గా ఉన్న తన వ్యక్తిగత పక్షపాతం కూడా ఈ నిర్ణయంపై కాస్త ప్రభావం చూపి ఉండవచ్చని ఒప్పుకుంటూనే, అప్పటికే వైట్ బాల్, టెస్టుల్లో తిరుగులేని పేసర్‌గా ఎదిగిన బుమ్రా వైపే మొగ్గు చూపాడు