జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారుల అంకితభావం, పట్టుదలను ప్రశంసిస్తూ.. యువతను ప్రేరేపించడంలో క్రీడల పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. క్రీడాభిమానుల అభిరుచి దేశం గర్వించేలా చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్‌కు నివాళులర్పించారు. ధ్యాన్‌చంద్ ప్రతిభ తరతరాలకు స్ఫూర్తినిస్తోందని తెలిపారు. కాగా, ప్రతి ఏడాది ఆగస్టు 29న మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. క్రీడలు గెలుపు కోసం మాత్రమే కాదు..! జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ కూడా దేశ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.క్రీడలు కేవలం గెలుపు కోసం మాత్రమే కాదని ఆయన అన్నారు. కలలు కనడం, కష్టపడి పనిచేయడం, వైఫల్యాలను ఎదుర్కోవడం, వాటిని అధిగమించి ముందుకు సాగడం వంటి జీవిత పాఠాలను క్రీడలు నేర్పుతాయని చెప్పారు. ఎక్కువ మంది యువత క్రీడల్లో పాల్గొనాలని ధవన్ పిలుపునిచ్చారు. చదవండి: టీ20 క్రికెట్‌లో సంచలనం.. సౌతాఫ్రికాకు షాకిచ్చిన నమీబియా మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్ నటి.. వైరల్‌గా (ఫొటోలు) ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) మా ఆయనను చంపింది కటౌట్ శ్రీను! సతీష్ రెడ్డి భార్య, వదిన సంచలన కామెంట్స్ టాక్సిక్ నిరాశలో రుక్మిణి.. ఇక ఆశలన్నీ డ్రాగన్ పైనే టార్చ్ లైట్లు వేసుకొని చికిత్సలా.. కొంచమైనా బుర్ర ఉందా..!?