Kaizer News

Milk Price Hike: పండుగ సీజన్‌కు ముందు మిల్క్ షాక్.

Milk Price Hike: పండుగ సీజన్‌కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102

· National - India · ntvtelugu.com

పండుగ సీజన్‌కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102 : --> Add as a preferred source on google Milk Price Hike: పండుగ సీజన్‌కు ముందు ముంబై వాసులకు పాల ధరల పెంపు షాక్ తగలనుంది. సెప్టెంబర్ 1, 2026 నుంచి నగరంలో బాటిళ్లు/డెయిరీల ద్వారా విక్రయించే పాలు లీటరుకు రూ.9 పెరగనున్నాయి. ప్రస్తుతం లీటరు రూ.93గా ఉన్న డెయిరీ పాల ధర ఇకపై రూ.102కు చేరనుంది. అయితే ఈ ధరల పెంపు ప్యాకేజ్డ్ పాలకు వర్తించదు. ప్రధానంగా బహిరంగ పాల దుకాణాలు, డెయిరీల నుంచి కొనుగోలు చేసే పాల ధరపైనే ప్రభావం పడనుంది. దీంతో రోజువారీ అవసరాల కోసం కుళాయి లేదా డెయిరీ పాలపై ఆధారపడే ముంబై కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై అదనపు భారం పడనుంది. సవరించిన ధరలు సెప్టెంబర్ 1, 2026 నుంచి ఫిబ్రవరి 28, 2027 వరకు అమల్లో ఉంటాయని పాల ఉత్పత్తిదారులు తెలిపారు. పశువుల నిర్వహణ ఖర్చులు పెరగడం, మేత, పశుగ్రాసం ధరలు గణనీయంగా పెరగడం వల్లే పాల ధరలను సవరించాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. మేత ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెంపు పాల ఉత్పత్తిదారుల ప్రకారం.. ఇటీవలి నెలల్లో పాడి పరిశ్రమ నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ధాన్యాలతో సహా వివిధ రకాల పశువుల మేత ధరలు 25 శాతం వరకు పెరిగాయి. పశుగ్రాసం, నూనె పిండి ధరలు కూడా పెరగడంతో పాలను ఉత్పత్తి చేసే మొత్తం వ్యయం మరింత పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం లీటరు పాల ధర రూ.93గా ఉండటంతో పెరిగిన ఉత్పత్తి ఖర్చులను భరించడం కష్టంగా మారిందని ఉత్పత్తిదారులు వివరించారు. అందుకే ధరను రూ.9 పెంచి రూ.102గా నిర్ణయించినట్లు తెలిపారు. ముంబై కుటుంబాలపై అదనపు భారం రోజువారీ పాల వినియోగం ఎక్కువగా ఉండే కుటుంబాలపై ఈ ధరల పెంపు నేరుగా ప్రభావం చూపనుంది. ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఇబ్బందులు పడుతున్న ముంబై ప్రజలకు పండుగ సీజన్‌కు కొద్ది రోజుల ముందు పాల ధరలు పెరగడం మరింత ఆర్థిక భారంగా మారనుంది. అంటే సెప్టెంబర్ 1 నుంచి ముంబైలో డెయిరీ లేదా బహిరంగ పాల దుకాణాల నుంచి పాలు కొనుగోలు చేసే వినియోగదారులు ఇప్పటివరకు చెల్లిస్తున్న లీటరుకు రూ.93కు బదులుగా రూ.102 చెల్లించాల్సి ఉంటుంది

Original source: ntvtelugu.com
Read more on Kaizer News