Kaizer News

చాలెంజింగ్‌ పాత్రతో ‘ఇట్లు అర్జున’

చాలెంజింగ్‌ పాత్రతో ‘ఇట్లు అర్జున’

· Entertainment · ntnews.com

వెంకీ కుడుముల నిర్మాతగా వాట్‌ నెక్ట్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. అనస్వర రాజన్‌ కథానాయిక. మహేశ్‌ ఉప్పల దర్శకుడు. అక్టోబర్‌ 30న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్మాత వెంకీ కుడుముల మాట్లాడుతూ ‘రష్మికను తెలుగుతెరకు పరిచయం చేసినందుకు గర్వంగా ఉండేది. ఇప్పుడు అనీష్‌ని పరిచయం చేస్తున్నందుకు అంతే గర్వపడుతున్నా. తను ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. దర్శకుడు మహేశ్‌ చాలా టాలెంటెడ్‌. తను చెప్పిన కథ తెరపై చూసినప్పుడు చాలా సంతృప్తిగా అనిపించింది. అనస్వర రాజన్‌ ఈ సినిమాకు ప్రధాన బలం. సాంకేతికంగా కూడా సినిమా రిచ్‌గా ఉంటుంది’ అని తెలిపారు. ఇది తాను తెలుగులో సైన్‌ చేసిన తొలి సినిమా అని, అందుకే ఈ సినిమా తనకు ప్రత్యేకమని, ఇందులో ‘కీర్తి’ పాత్రను ఎంజాయ్‌ చేస్తూ పోషించానని, ఈ పాత్రలో ఉండే అమాయకత్వం, హ్యాపీనెస్‌ని ఎంజాయ్‌ చేశానని అనస్వర రాజన్‌ చెప్పారు. అవకాశం ఇచ్చిన నిర్మాతకు దర్శకుడు మహేశ్‌ ఉప్పల కృతజ్ఞతలు చెప్పాడు. మంచి కంటెంట్‌ ఉన్న సినిమా ఇదని ఆయన తెలిపారు. ఇంకా హీరో అనీష్‌, మాసనశర్మ కూడా మాట్లాడారు

Original source: ntnews.com
Read more on Kaizer News