Kaizer News

సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడిన హెడ్‌ కానిస్టేబుల్‌

సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడిన హెడ్‌ కానిస్టేబుల్‌

· City - Hyderabad · ntnews.com

మలక్‌పేట: ఆత్మహత్యకు యత్నించి.. అపస్మారక స్థితికి చేరుకున్న ఓ విద్యార్థికి హెడ్‌ కానిస్టేబుల్‌ సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడాడు. రామాయపురం అత్తిలికి చెందిన ప్రవీణ్‌(22) ఆస్మాన్‌ఘడ్‌ ఆంధ్రా బ్యాంక్‌ కాలనీ రాఘవేంద్ర టవర్స్‌ ఫేజ్‌-2 ఫ్లాట్‌ నంబర్‌-7లో అతడి మామ వద్ద ఉంటూ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. శుక్రవారం ప్రవీణ్‌ ఇంట్లో ఉరివేసుకోగా, అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన అతడి మామ, కుటుంబ సభ్యులు వెంటనే కిందకి దింపారు. సమాచారాన్ని అందుకున్న మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌ పెట్రో కార్‌-1కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ రవి అక్కడికి చేరుకొని ప్రవీణ్‌కు సీపీఆర్‌ చేయడంతో ప్రాణం నిలిచింది. ప్రాణాలు కాపాడిన హెడ్‌ కానిస్టేబుల్‌ రవికి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. హెడ్‌కానిస్టేబుల్‌ రవిని మలక్‌పేట ఇన్‌స్పెక్టర్‌ కుందూరు వెంకట్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు

Original source: ntnews.com
Read more on Kaizer News